Telugu Global
NEWS

ఆర్టీసీ విద్యుత్ బస్సులకు రివర్స్ టెండర్లు

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే పలు పనులకు రివర్స్ టెండర్లను ఆహ్వానిస్తూ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏపీఎస్ ఆర్టీసీలో కూడా ఈ రివర్స్ టెండరింగ్ కు శ్రీకారం చుట్టారు. ఆర్టీసీలో తొలి విడతగా తీసుకునే విద్యుత్ బస్సులకు ఈ రివర్స్ టెండరింగ్ ను నిర్వహించాలని నిర్ణయించారు. తొలి విడతగా లీజుకు తీసుకునే విద్యుత్ బస్సులకు వచ్చే నెల 6 వ తేదీన రివర్స్ టెండరింగ్ నిర్వహించనున్నారు. రివర్స్ టెండరింగ్ తో దేశవ్యాప్తంగా అందరి […]

ఆర్టీసీ విద్యుత్ బస్సులకు రివర్స్ టెండర్లు
X

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే పలు పనులకు రివర్స్ టెండర్లను ఆహ్వానిస్తూ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏపీఎస్ ఆర్టీసీలో కూడా ఈ రివర్స్ టెండరింగ్ కు శ్రీకారం చుట్టారు.

ఆర్టీసీలో తొలి విడతగా తీసుకునే విద్యుత్ బస్సులకు ఈ రివర్స్ టెండరింగ్ ను నిర్వహించాలని నిర్ణయించారు. తొలి విడతగా లీజుకు తీసుకునే విద్యుత్ బస్సులకు వచ్చే నెల 6 వ తేదీన రివర్స్ టెండరింగ్ నిర్వహించనున్నారు. రివర్స్ టెండరింగ్ తో దేశవ్యాప్తంగా అందరి ద్రష్టిని తన వైపు తిప్పుకున్న ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు బస్సుల లీజు విషయంలో కూడా మరో నూతన అడుగు వేస్తున్నారు.

తిరుమల – తిరుపతి మధ్య 9 మీటర్ల పొడవు ఉండే 50 బస్సులు, మిగిలిన నగరాల్లో 12 మీటర్ల పొడవు ఉండే 300 బస్సులు లీజుకు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మొత్తం 350 బస్సుల లీజుకు గత నెలలో టెండర్లు పిలిచారు. ఈ టెండర్ల గడువు ఈ నెల 14వ తేదీతో ముగుస్తుంది.

అయితే తాజాగా ఈ గడువును ఈ నెల 21 వరకూ పొడిగిస్తే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ బస్సులకు 35 నుంచి 55 లక్షల వరకూ కేంద్ర ప్రభుత్వం ఫేమ్ -2 పథకం కింద సాయం చేస్తుంది. ఈ టెండర్ గడువు ముగిసిన తర్వాత టెండరింగ్ లో పాల్గొన్న వారి సాంకేతిక అర్హతను పరిశీలించి ఆనంతరం నవంబర్ 5వ తేదీన బిడ్లను తెరుస్తారు. ఒక్కో బిడ్ లోనూ ఎవరు ఎంత కోట్ చేశారో పరిశీలిస్తారు. ఆ కోట్ కంటే తక్కువ కోట్ చేసిన వారికోసం ఆ మర్నాడు అంటే నవంబర్ 6వ తేదీన రివర్స్ టెండర్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ ప్రభుత్వంతో నవంబర్ రెండో వారంలోగా ఒప్పందం చేసుకుంటారు. ఆ బప్పందం మేరకు రెండు నెలల్లోగా ప్రభుత్వానికి మోడల్ బస్సులను అందజేయాలి. ఆ బస్సులలో లోటుపాట్లను, ఇతర సాంకేతిక అంశాలను పరిశీలించిన తర్వాత ఇబ్బందులు ఏమైనా ఉంటే వాటిని సరిచేసుకుని వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెల నాటికి అన్ని బస్సులను కాంట్రాక్టర్ ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంటుంది.

తొలి విడత తీసుకున్న బస్సుల కోసం నీతి అయోగ్ పేర్కొన్న కొన్ని నిబంధనలను పాటించనున్నారు. వీటి కోసం ప్రత్యేకంగా ఎస్ర్కో ఖాతా తెరవనున్నారు. ఈ బస్సులు తిరిగినప్పుడు వచ్చే ఆదాయం ఆ ఖాతాలోనే జమ చేస్తారు. వాటిలోంచి ప్రతి నెలా గుత్తెదారుకు ఇవ్వాల్సిన సొమ్మ చెల్లించి ఆ తర్వాత ఏదైనా మిగిలితే దాన్ని ఆర్టీసీ ఖాతాలో జమ చేస్తారు. ఈ బస్సుల లీజు గడువు 12 సంవత్సరాలు. ఒక్కో బస్సు డిపాజిట్ గా లక్ష రూపాయలు జమ చేయాల్సి ఉంటుంది. ముందుగా దీనిని 5 లక్షలుగా నిర్ణయించారు. అయితే కొన్ని అభ్యంతరాలు రావడంతో దాన్ని లక్షకు కుదించారు.

First Published:  5 Oct 2019 1:50 AM IST
Next Story