Telugu Global
Cinema & Entertainment

ఆ విధంగా 'అల్లు'కు పోయాడు

మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్ దూరంగా ఉన్నారని, అందుకే సైరా ఫంక్షన్లకు రాలేదని, కనీసం సైరా రిలీజ్ కి ముందు ఓ ట్వీట్ కూడా చేయలేదని చాలానే గుసగుసలు వినిపించాయి. గుసగుసలేం ఖర్మ యూట్యూబ్ ఛానెళ్లన్నీ ఇవే వార్తల్ని వండివార్చాయి. సోషల్ మీడియాలో స్టైలిష్ స్టార్ విపరీతంగా ట్రోలింగ్ కి గురయ్యాడు. ప్రీ రిలీజ్ ఫంక్షన్లో అల్లు అరవింద్ ఎక్కువసేపు మాట్లాడకపోవడానికి కూడా పరోక్షంగా కారణం ఇదే. సినిమా రిలీజయ్యాక మాత్రం ప్యాచప్ కార్యక్రమాలు శరవేగంగా సాగాయి. […]

ఆ విధంగా అల్లుకు పోయాడు
X

మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్ దూరంగా ఉన్నారని, అందుకే సైరా ఫంక్షన్లకు రాలేదని, కనీసం సైరా రిలీజ్ కి ముందు ఓ ట్వీట్ కూడా చేయలేదని చాలానే గుసగుసలు వినిపించాయి. గుసగుసలేం ఖర్మ యూట్యూబ్ ఛానెళ్లన్నీ ఇవే వార్తల్ని వండివార్చాయి. సోషల్ మీడియాలో స్టైలిష్ స్టార్ విపరీతంగా ట్రోలింగ్ కి గురయ్యాడు. ప్రీ రిలీజ్ ఫంక్షన్లో అల్లు అరవింద్ ఎక్కువసేపు మాట్లాడకపోవడానికి కూడా పరోక్షంగా కారణం ఇదే. సినిమా రిలీజయ్యాక మాత్రం ప్యాచప్ కార్యక్రమాలు శరవేగంగా సాగాయి.

సినిమాకి హిట్ టాక్ వచ్చిన వెంటనే అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో కలసి ఏఎంబీ థియేటర్లో సైరాకు వెళ్లి, ఆ ఫొటోలు పీఆర్వోలకిచ్చేశారు. ఇంకేముంది ఒక్క దెబ్బతో అల్లుఅర్జున్ మెగాభిమానులకు అస్మదీయుడయ్యారు. ఆ తర్వాత అసలు స్టోరీ నడిచింది. సైరా టీమ్ కి అల్లువారింట్లో సక్సెస్ పార్టీ. ఈమధ్య కాలంలో మాంచి హిట్ సినిమాలని మెచ్చుకుంటూ అల్లుఅర్జున్ ఆయా సినిమాల యూనిట్ కి పార్టీ ఇవ్వడం కామన్ అయిపోయింది. అలాగే సైరా టీమ్ ని కూడా అల్లువారింటికి తీసుకొచ్చి ఫొటోలతో విపరీతంగా ప్రచారం చేసుకున్నారు.

అల్లుఅర్జున్ కొత్త సినిమా దర్శకుడు త్రివిక్రమ్ కూడా వచ్చేసరికి సందడి ఇంకాస్త పెరిగింది. సైరా ప్రీరిలీజ్ ఈవెంట్ కి మిస్సైన దర్శకుడు సుకుమార్ ఇక్కడ ప్రత్యక్షమయ్యారు. రంగస్థలం లాంటి హిట్ ఇచ్చినా సైరా కార్యక్రమానికి సుకుమార్ ని పిలవలేదంటూ రామ్ చరణ్ పై కూడా అప్పట్లో కొన్ని విమర్శలొచ్చాయి. ఈ కార్యక్రమంతో ఆ లెక్క కూడా సరిపోయింది. పోనీ సుక్కూని బన్నీయే తీసుకొచ్చి కలిపేశాడనుకుందాం. అలా కూడా అందర్నీ ఒకచోట చేర్చి ప్యాచప్ ప్రోగ్రామ్ ని సక్సెస్ ఫుల్ గా నిర్వహించింది అల్లు ఫ్యామిలీ. మొత్తమ్మీద అల్లు కుటుంబం ఆ విధంగా అల్లుకుపోయిందన్నమాట.

First Published:  5 Oct 2019 11:26 AM IST
Next Story