Telugu Global
NEWS

యనమల వియ్యంకుడికి "రివర్స్ టెండరింగ్"

టీడీపీ హయాంలో వందల కోట్ల విలువైన కాంట్రాక్టు పనులను కూడా చంద్రబాబు ఆదేశాలతో నామినేషన్ పద్దతిలో కేటాయించారు. టెండర్లు కూడా పిలవకుండానే టీడీపీ నేతల కంపెనీలకు కీలకమైన పనులు అప్పగించారు. సీఎం రమేష్ కంపెనీ, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు వియ్యంకుడి కంపెనీకి ఇలా కావాల్సినన్ని పనులు నామినేషన్ పద్దతిలో అధిక ధరకు కేటాయించారు. ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వం అలాంటి పనులకు రివర్స్ టెండరింగ్ నిర్వహిస్తోంది. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టులోని 65 ప్యాకేజీకి రివర్స్ టెండరింగ్ […]

యనమల వియ్యంకుడికి రివర్స్ టెండరింగ్
X

టీడీపీ హయాంలో వందల కోట్ల విలువైన కాంట్రాక్టు పనులను కూడా చంద్రబాబు ఆదేశాలతో నామినేషన్ పద్దతిలో కేటాయించారు. టెండర్లు కూడా పిలవకుండానే టీడీపీ నేతల కంపెనీలకు కీలకమైన పనులు అప్పగించారు. సీఎం రమేష్ కంపెనీ, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు వియ్యంకుడి కంపెనీకి ఇలా కావాల్సినన్ని పనులు నామినేషన్ పద్దతిలో అధిక ధరకు కేటాయించారు.

ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వం అలాంటి పనులకు రివర్స్ టెండరింగ్ నిర్వహిస్తోంది. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టులోని 65 ప్యాకేజీకి రివర్స్ టెండరింగ్ నిర్వహించి భారీగా సొమ్ము ఆదా చేశారు. పోలవరం ప్రధాన డ్యాం, హైడల్ ప్రాజెక్టులో 782 కోట్లు ఆదా చేశారు. ఇప్పుడు పోలవరం ఎడవ కాలువ ఐదో ప్యాకేజీకి రివర్స్ టెండరింగ్ నిర్వహించబోతున్నారు.

ఈ పనిని టీడీపీ హయాంలో యనమల రామకృష్ణుడి వియ్యంకుడు పుట్టా సుధాకర్ యాదవ్‌కు చెందిన కంపెనీకి నామినేషన్‌ పద్దతిలో అప్పగించేశారు. 142 కోట్ల విలువైన పని వ్యయం పెంచి రూ. 181. 87 కోట్లకు పుట్టా కంపెనీకి చంద్రబాబు అప్పగించారు. తొలుత ఈ పనిని సాబీర్ డ్యాం వాటర్ వర్క్స్ సంస్థ టెండర్‌లో దక్కించుకుంది. కానీ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఆ కంపెనీ కాంట్రాక్టును రద్దు చేసి నామినేషన్ పద్దతిలో అధిక ధరకు పుట్టాకు అప్పగించారు. ఇప్పుడు ఈ కాంట్రాక్టును రద్దు చేసింది ఏపీ ప్రభుత్వం. రివర్స్ టెండరింగ్ నిర్వహించబోతుంది.

First Published:  4 Oct 2019 1:42 AM IST
Next Story