అజ్ఞాతంలో హర్షకుమార్.... సహకరించిన సీఐ సస్పెన్షన్
అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ చిక్కుల్లో పడ్డారు. ఇప్పుడు కేసుల భయంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయనను పట్టుకోవడంలో నిర్లక్ష్యం వహించిన సీఐని కూడా సస్పెండ్ చేశారు. ఆయన పారిపోతుండగా చూసి సహకరించినందుకు గాను ఇప్పుడు సీఐని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తుండడం ఏపీ పోలీస్ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. గతనెల 28న రాజమండ్రి కోర్టుకు చెందిన స్థలంలో ఆక్రమణలను జిల్లా న్యాయమూర్తి, సిబ్బంది తొలగిస్తుండగా మాజీ ఎంపీ హర్షకుమార్ వచ్చి వారిని పరుష పదజాలంతో దూషించాడు. కోర్టు […]
అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ చిక్కుల్లో పడ్డారు. ఇప్పుడు కేసుల భయంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయనను పట్టుకోవడంలో నిర్లక్ష్యం వహించిన సీఐని కూడా సస్పెండ్ చేశారు. ఆయన పారిపోతుండగా చూసి సహకరించినందుకు గాను ఇప్పుడు సీఐని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తుండడం ఏపీ పోలీస్ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.
గతనెల 28న రాజమండ్రి కోర్టుకు చెందిన స్థలంలో ఆక్రమణలను జిల్లా న్యాయమూర్తి, సిబ్బంది తొలగిస్తుండగా మాజీ ఎంపీ హర్షకుమార్ వచ్చి వారిని పరుష పదజాలంతో దూషించాడు. కోర్టు ఉద్యోగులను బెదిరించాడు. ఉద్యోగులను పక్కకు నెట్టాడు. మహిళా ఉద్యోగినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. జిల్లా న్యాయమూర్తినే తిట్టడంతో కోర్టు పరిపాలనాధికారి హర్షకుమార్ పై రాజమండ్రి త్రీటౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
అయితే హర్షకుమార్ ను అరెస్ట్ చేయడానికి త్రీటౌన్ సీఐ ఎం శేఖర్ బాబు ఆయన ఇంటికి వెళ్లారు. సీఐ, ఇతర పోలీసుల కళ్లెదుటే హర్షకుమార్ పారిపోగా…. తప్పించుకునేందుకు సీఐ సహకరించినట్టు తేలింది. దీంతో అలసత్వం ప్రదర్శించిన సీఐని సస్పెండ్ చేశారు. సీఐపై కేసు పెట్టి అరెస్ట్ చేస్తామని డీఐజీ ఏఎస్ ఖాన్ స్పష్టం చేశారు.
ఇక హర్షకుమార్ మెడకు మరో కేసు చుట్టుకుంది. గోదావరి బోటు ప్రమాదంలో తప్పుడు ఆరోపణలు చేసి…. ఆధారాలు ఇవ్వాలని నోటీసులు ఇచ్చినా స్పందించనందుకు అతడిపై చర్యలకు పోలీసులు రంగంలోకి దిగారు. ఇలా పూర్తిగా కేసుల్లో ఇరుక్కుపోయిన మాజీ ఎంపీ హర్షకుమార్ ఇప్పుడు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.