Telugu Global
NEWS

చంద్రబాబు ... పుకార్లకు పితామహుడు, విష ప్రచారానికి మర్రి విత్తనం లాంటోడు

సోషల్ మీడియాలో ఎవరో బూతు పోస్టులు పెడితే వాటిని మీడియా సమావేశంలో చంద్రబాబు చదివి వినిపించడం ఏమిటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు వైసీపీ నేత సీ. రామచంద్రయ్య. చంద్రబాబు నోటి నుంచి ఆ బూతులు రావడం చూసి తాము నిర్ఘాంతపోయామన్నారు. ఇది ఒక జెంటిల్ మెన్‌కు ఉండాల్సిన లక్షణమేనా అని ఆక్షేపించారు. నీచ సంస్కృతికి, విష ప్రచారానికి చంద్రబాబు ఒక మర్రి విత్తనం లాంటివాడు అని విమర్శించారు. ఇందిరాగాంధీ నుంచి ఎన్టీఆర్‌, నరేంద్రమోడీ వరకు 40ఏళ్లుగా చంద్రబాబు […]

చంద్రబాబు ... పుకార్లకు పితామహుడు, విష ప్రచారానికి మర్రి విత్తనం లాంటోడు
X

సోషల్ మీడియాలో ఎవరో బూతు పోస్టులు పెడితే వాటిని మీడియా సమావేశంలో చంద్రబాబు చదివి వినిపించడం ఏమిటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు వైసీపీ నేత సీ. రామచంద్రయ్య. చంద్రబాబు నోటి నుంచి ఆ బూతులు రావడం చూసి తాము నిర్ఘాంతపోయామన్నారు. ఇది ఒక జెంటిల్ మెన్‌కు ఉండాల్సిన లక్షణమేనా అని ఆక్షేపించారు. నీచ సంస్కృతికి, విష ప్రచారానికి చంద్రబాబు ఒక మర్రి విత్తనం లాంటివాడు అని విమర్శించారు.

ఇందిరాగాంధీ నుంచి ఎన్టీఆర్‌, నరేంద్రమోడీ వరకు 40ఏళ్లుగా చంద్రబాబు ఇదే తరహా నీచ ప్రచారం చేయిస్తూనే ఉన్నారన్నారు. పుకార్లకు మారుపేరు చంద్రబాబు అని విమర్శించారు. ఎన్టీఆర్‌ మీద ఇష్టానుసారం రాతలు రాయించి, నీచమైన పుకార్లు సృష్టించి ఎన్టీఆర్‌ వ్యక్తిత్వాన్ని హత్య చేయించింది చంద్రబాబు కాదా అని నిలదీశారు.

40 ఏళ్లుగా ప్రత్యర్థులపై నీచ ప్రచారాన్ని చంద్రబాబు వ్యవస్థీకృతంగా చేశారన్నారు. ఇంత దిగజారిపోయిన తర్వాత రాజకీయాల్లో ఉండేందుకు చంద్రబాబుకు అర్హత ఉందా అని అనుమానం వ్యక్తం చేశారు. టీడీపీ ప్రత్యర్థులపై జరిగిన ప్రచారం ఎవరో ఇంట్లో కూర్చుని చేసింది కాదని.. హైదరాబాద్‌లోని బాలకృష్ణ భవనం, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌, విజయవాడలోని టీడీపీ సోషల్ మీడియా కార్యాలయం నుంచి ఈ ప్రచారం చేశారన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా వర్క్ ఫ్రం హోం విధానంలో 2వేల మందిని నియమించి చంద్రబాబు తన ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ఇలా నీచంగా ప్రచారం చేయించారన్నారు. కాబట్టి దీన్ని ఎవరో ఇంట్లో కూర్చుని చేసిన సోషల్ మీడియా ప్రచారం కాదని… సోషల్ మీడియా ముసుగులో చంద్రబాబు చేయిస్తున్న ప్రచారం అని రామచంద్రయ్య వివరించారు.

అధికారం పోయినప్పటి నుంచి వైసీపీ ప్రభుత్వంపై బురద జల్లేందుకు చంద్రబాబు నిరంతరం సమీక్షలు చేస్తున్నారని వివరించారు. ఎప్పటికప్పుడు మీడియాకు సమాచారం అందిస్తూ తనకు కావాల్సిన విధంగా ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. బీజేపీలోకి వెళ్లిన చంద్రబాబు కోవర్టులు ఇప్పుడు నీతులు చెబుతుంటే విచిత్రంగా ఉందన్నారు.

మద్యం విధానంలో అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వమే మద్యం షాపుల నిర్వాహణ చేపడితే చంద్రబాబు దానిపైనా ఎందుకు విమర్శలు చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. ఎన్టీఆర్‌ హయాంలో సారాయి దుకాణాలను ప్రభుత్వమే నడిపలేదా అని గుర్తు చేశారు.

చంద్రబాబు హయాంలో కే ట్యాక్స్, చినబాబు ట్యాక్స్‌( సీ- ట్యాక్స్) పేరుతో ఎలా దోచుకున్నారో అందరికీ తెలుసన్నారు. అక్రమ నివాసం కట్టిన లింగమనేని రమేష్‌కు, పోలవరంలో దోపిడి చేసిన కాంట్రాక్టర్లకు, లంచాలు తీసుకుని చేసుకున్న విద్యుత్ ఒప్పందాల విషయంలో ప్రైవేట్ సంస్థలకు వత్తాసు పలకడం తప్ప చంద్రబాబు ఈ నాలుగు నెలల్లో ఏ ఒక్క విషయంలోనైనా ప్రజల పక్షాన నిలిచారా అని సీ.రామచంద్రయ్య నిలదీశారు. సమాజాన్ని వ్యవస్థీకృతంగా విషతుల్యం చేయడం మానేసి చంద్రబాబు తక్షణం రాజకీయాల నుంచి రిటైర్ రావాలని సూచించారు.

రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడం మాత్రమేనని.. ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి ప్రస్తుతం అదే దారిలో నడుస్తున్నారన్నారు. కానీ 23 సీట్లకు పరిమితం అయిన చంద్రబాబు ఎందుకు ఈ స్థాయికి పడిపోయారో ఆలోచన చేసుకోకుండా ఒక ఉన్మాదిగా ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదన్నారు.

చివరకు మతపరమైన విధ్వేషాలు రెచ్చగొట్టేందుకు కూడా చంద్రబాబు వెనుకాడడం లేదన్నారు. సదావర్తి భూములు కాజేసే ప్రయత్నం, విజయవాడలో 40 గుళ్లను కూల్చివేయడం, దుర్గమ్మ ఆలయంలో క్షుద్రపూజలు, దుర్గమ్మ ఆలయ భూములు అనుకూలమైన వ్యక్తులకు అప్పగించడం, కనకదుర్గ అమ్మవారి కిరీటం మాయమవడం, వెంకటేశ్వరస్వామి ఆలయం పోటులో తవ్వకాలు జరపడం వంటివి జరిగింది చంద్రబాబు హయాంలో కాదా అని రామచంద్రయ్య ప్రశ్నించారు.

ప్రజా సమస్యలపై మాట్లాడకుండా అనవసర అంశాలపై ప్రజలను రెచ్చగొట్టడం ఎంత వరకు సమంజసమని వ్యాఖ్యానించారు. మొదటి సంతకంతోనే రైతు రుణాలు, మొదటి సంతకంతోనే డ్వాక్రా రుణాలు, మొదటి సంతకంతోనే బెల్ట్ షాపులు రద్దు చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు అన్నారు. అలాంటి అంశాలపై ఎందుకు మాట్లాడడం లేదని నిలదీశారు.

First Published:  4 Oct 2019 9:36 AM GMT
Next Story