ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్ మహేశ్వరి
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పూర్తి స్థాయి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి నియమితులయ్యారు. ఆయన నియామకానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. ప్రస్తుతం జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి మధ్యప్రదేశ్ హైకోర్టులో సీనియర్ న్యాయమూర్తిగా రెండో స్థానంలో ఉన్నారు. కొలిజియం సిఫార్సు మేరకు ఆయన్ను ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. తొలుత ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్‌నాథ్ పేరును కొలిజియం సిఫార్సు చేసింది. కానీ […]
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పూర్తి స్థాయి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి నియమితులయ్యారు. ఆయన నియామకానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. ప్రస్తుతం జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి మధ్యప్రదేశ్ హైకోర్టులో సీనియర్ న్యాయమూర్తిగా రెండో స్థానంలో ఉన్నారు. కొలిజియం సిఫార్సు మేరకు ఆయన్ను ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది.
తొలుత ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్‌నాథ్ పేరును కొలిజియం సిఫార్సు చేసింది. కానీ విక్రమ్‌నాథ్‌ను నియమించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించలేదు. కొలిజియం సిఫార్సును తిరస్కరించింది. దాంతో జస్టిస్ మహేశ్వరిని కొలిజియం సిఫార్సు చేసింది.
ఇప్పటి వరకు ఏపీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సి. ప్రవీణ్ కుమార్ వ్యవహరిస్తూ వచ్చారు. ప్రస్తుతం పూర్తి స్థాయి సీజే రావడంతో ప్రవీణ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సీనియర్ న్యాయమూర్తిగా రెండో స్థానంలో కొనసాగుతారు.
కొత్తగా వచ్చిన జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి… మధ్యప్రదేశ్ హైకోర్టులోనే సివిల్, క్రిమినల్, రాజ్యాంగ వ్యవహారాల న్యాయవాదిగా పనిచేశారు. 2005లో మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.