Telugu Global
Cinema & Entertainment

ఈసారి 25 గెటప్పులు

సినిమాల్లో గెటప్స్ అంటే ముందుగా ఎవరికైనా గుర్తుకొచ్చేది కమల్ హాసన్. కమల్ తర్వాత విక్రమ్ ఆ స్థానాన్ని ఆక్రమిస్తాడు. ఇప్పుడీ హీరో గెటప్స్ పరంగా మరో ప్రయోగానికి రెడీ అవుతున్నాడు. తన కొత్త సినిమాలో విక్రమ్ ఏకంగా 25 గెటప్స్ లో కనిపించబోతున్నాడట. ప్రపంచ సినిమాలో ఇలా ఒకే మూవీలో 25 గెటప్స్ వేసిన హీరో ఎవరూ లేరట. ఆ అరుదైన ఘనత సాధించబోతున్న హీరోగా విక్రమ్ రికార్డు సృష్టించబోతున్నాడు. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో ఓ సినిమాకు […]

ఈసారి 25 గెటప్పులు
X

సినిమాల్లో గెటప్స్ అంటే ముందుగా ఎవరికైనా గుర్తుకొచ్చేది కమల్ హాసన్. కమల్ తర్వాత విక్రమ్ ఆ స్థానాన్ని ఆక్రమిస్తాడు. ఇప్పుడీ హీరో గెటప్స్ పరంగా మరో ప్రయోగానికి రెడీ అవుతున్నాడు. తన కొత్త సినిమాలో విక్రమ్ ఏకంగా 25 గెటప్స్ లో కనిపించబోతున్నాడట. ప్రపంచ సినిమాలో ఇలా ఒకే మూవీలో 25 గెటప్స్ వేసిన హీరో ఎవరూ లేరట. ఆ అరుదైన ఘనత సాధించబోతున్న హీరోగా విక్రమ్ రికార్డు సృష్టించబోతున్నాడు.

అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో ఓ సినిమాకు విక్రమ్ ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. చెన్నైలో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఇవాళ్టి నుంచి ప్రారంభం కాబోతోంది. ఈ మూవీలో విక్రమ్ 25 గెటప్స్ లో కనిపిస్తాడట. దీని కోసం యూరోప్ నుంచి ప్రత్యేకంగా మేకప్ ఆర్టిస్టుల్ని రప్పించారు. వాళ్లు 4 నెలల పాటు ఇక్కడే ఉండి, విక్రమ్ కు రకరకాల గెటప్స్ వేస్తారన్నమాట.

ఇండియాలో ఇప్పటివరకు ఒకే సినిమాలో అత్యథిక గెటప్స్ వేసిన హీరోగా కమల్ హాసన్ నిలిచాడు. దశావతారం సినిమాలో కమల్ 10 గెటప్స్ లో కనిపించాడు. ఇప్పటివరకు అదే రికార్డు. ఇప్పుడీ రికార్డును విక్రమ్ అధిగమించబోతున్నాడు. పాతిక గెటప్స్ తో సరికొత్త రికార్డు సృష్టించబోతున్నాడు. గెటప్స్ సంగతి సరే. ఇంతకీ సినిమాలో కంటెంట్ సంగతేంటి? ఇప్పటికే వరుస ఫ్లాపులతో ఉన్నాడు విక్రమ్. గెటప్స్ మాయలో పడి ఈ సినిమాను కూడా పట్టించుకోకపోతే మరో ఫ్లాప్ ఖాయం.

First Published:  3 Oct 2019 4:53 PM IST
Next Story