Telugu Global
NEWS

ముంబై క్రికెట్ సంఘం ఎన్నికల్లో సచిన్ కు ఓటు హక్కు

39 మంది మాజీ క్రికెటర్లకు ఓటు హక్కు బీసీసీఐ పాలకమండలి ఆదేశాల ప్రకారం ముంబై క్రికెట్ సంఘానికి అక్టోబర్ 4న జరిగే ఎన్నికల్లో మాస్టర్ సచిన్ టెండుల్కర్ తో సహా మొత్తం 39మంది అంతర్జాతీయ క్రికెటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. మాస్టర్ సచిన్ టెండుల్కర్, దిలీప్ వెంగ్ సర్కార్, అభయ్ కురువిల్లా, అజిత్ అగార్కర్, అజిత్ పాయ్, అవిష్కార్ సాల్వి, చంద్రకాంత్ పండిట్, జతిన్ పరంజపే, నీలేశ్ కులకర్ణీ, రమేశ్ పవార్, సాయిరాజ్ బహుతులే, సలీల్ అంకోలా, సంజయ్ మంజ్రేకర్, […]

ముంబై క్రికెట్ సంఘం ఎన్నికల్లో సచిన్ కు ఓటు హక్కు
X
  • 39 మంది మాజీ క్రికెటర్లకు ఓటు హక్కు

బీసీసీఐ పాలకమండలి ఆదేశాల ప్రకారం ముంబై క్రికెట్ సంఘానికి అక్టోబర్ 4న జరిగే ఎన్నికల్లో మాస్టర్ సచిన్ టెండుల్కర్ తో సహా మొత్తం 39మంది అంతర్జాతీయ క్రికెటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు.

మాస్టర్ సచిన్ టెండుల్కర్, దిలీప్ వెంగ్ సర్కార్, అభయ్ కురువిల్లా, అజిత్ అగార్కర్, అజిత్ పాయ్, అవిష్కార్ సాల్వి, చంద్రకాంత్ పండిట్, జతిన్ పరంజపే, నీలేశ్ కులకర్ణీ, రమేశ్ పవార్, సాయిరాజ్ బహుతులే, సలీల్ అంకోలా, సంజయ్ మంజ్రేకర్, సందీప్ పాటిల్, సంజయ్ బంగర్, జహీర్ ఖాన్, వినోద్ కాంబ్లీతో పాటు పలువురు భారత మహిళా క్రికెటర్లు సైతం తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

మాజీ క్రికెటర్లకు తొలిసారిగా ఓటుహక్కు…

గాడితప్పిన భారత క్రికెట్ బోర్డును దారిలో పెట్టడానికి జస్టిస్ లోథా ప్రవేశపెట్టిన సంస్కరణల ప్రకారం దేశంలోని వివిధ క్రికెట్ సంఘాలకు చెందిన అంతర్జాతీయ మాజీ క్రికెటర్లకు సైతం ఓటు హక్కు లభించింది. దీంతో బీసీసీఐ చరిత్రలోనే భారత మాజీ క్రికెటర్లు తమ ఓటుతో కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకోబోతున్నారు.

విజయ్ పాటిల్, బాల్ మహదోద్కర్ గ్రూపు, సందీప్ పాటిల్ గ్రూపు తమ తమ ప్యానెల్స్ తో ఎన్నికల్లో పోటీకి దిగుతున్నారు.

First Published:  3 Oct 2019 7:18 AM IST
Next Story