Telugu Global
NEWS

బోటు వెలికితీత నిలిపివేత...

గోదావరిలో ఇటీవల మునిగిపోయిన బోటును తీసేందుకు ప్రభుత్వ యంత్రాంగం, ఎన్డీఆర్‌ఎఫ్‌ తొలుత ఎంతగానో శ్రమించాయి. కానీ అక్కడ గోదావరి ఉధృతి అధికంగా ఉండడంతో పాటు లోతు ఏకంగా 300 అడుగులు ఉండడంతో అది సాధ్యం కాలేదు. ఇంతలో ప్రభుత్వంపై ఒక వర్గం మీడియా దాడికి దిగింది. అంతలో వెంకట శివ అనే వ్యక్తి మీడియా ముందుకు వచ్చి తనకు అవకాశం ఇస్తే రెండు గంటల్లో బోటును బయటకు తీసేస్తా అంటూ ఇంటర్వ్యూలు ఇచ్చారు. దాంతో మీడియా ఒక […]

బోటు వెలికితీత నిలిపివేత...
X

గోదావరిలో ఇటీవల మునిగిపోయిన బోటును తీసేందుకు ప్రభుత్వ యంత్రాంగం, ఎన్డీఆర్‌ఎఫ్‌ తొలుత ఎంతగానో శ్రమించాయి. కానీ అక్కడ గోదావరి ఉధృతి అధికంగా ఉండడంతో పాటు లోతు ఏకంగా 300 అడుగులు ఉండడంతో అది సాధ్యం కాలేదు. ఇంతలో ప్రభుత్వంపై ఒక వర్గం మీడియా దాడికి దిగింది.

అంతలో వెంకట శివ అనే వ్యక్తి మీడియా ముందుకు వచ్చి తనకు అవకాశం ఇస్తే రెండు గంటల్లో బోటును బయటకు తీసేస్తా అంటూ ఇంటర్వ్యూలు ఇచ్చారు. దాంతో మీడియా ఒక వ్యక్తి రెండు గంటల్లో బోటు తీసేస్తా అంటుంటే ప్రభుత్వ యంత్రాంగం మాత్రం రోజులు గడుస్తున్నా దాన్ని తీయలేకపోతోందని… ప్రభుత్వానికి అసలు బోటును బయటకు తీయాలన్న ఉద్దేశమే లేదు అంటూ ఆరోపణలు చేసింది.

చేసేది లేక ప్రభుత్వం అలా పడవను బయటకు తీస్తామంటూ ముందుకొచ్చిన ప్రైవేట్‌ వ్యక్తులకే ఆ పనిని అప్పగించింది. కాకినాడకు చెందిన ధర్మాడి సత్యం బృందానికి ఆ పనిని అప్పగించింది. రెండు గంటల్లో బోటును బయటకుతెస్తా అని ఇంటర్వ్యూలు ఇచ్చిన వెంకటశివను కూడా ఆ బృందంలో భాగస్వామిని చేసి 22 లక్షలకు బోటును బయటకు తీసే పనిని అప్పగించారు.

మూడు రోజులుగా బోటు తీసేందుకు సత్యం బృందం, వెంకటశివ ప్రయత్నించారు. కానీ ఏమాత్రం పురోగతి కనిపించలేదు. లంగరు వేస్తుంటే అది కొండ రాళ్లకు తగులుతోంది తప్ప బోటు కనిపించలేదు. పలుమార్లు తాళ్లు కూడా తెగిపోయాయి. దీనికి తోడు గోదావరి ఉధృతి అధికంగా ఉండడంతో తాజాగా బోటు వెలికితీత కార్యక్రమాన్ని నిలిపేశారు.

పక్కనే ఉన్న కచ్చులూరు గ్రామస్తులు… ప్రమాదం జరిగిన చోట బోటును వెలికితీయడం అంత ఈజీ కాదని ముందు నుంచే చెబుతున్నారు. లోతు 300 అడుగులకు పైగా ఉండడం, అక్కడ నది సుడులు తిరుగుతుండడంతో బోటు పూర్తిగా బురదలో కూరుకుపోయి ఉంటుందని వారు తమ అనుభవంతో వివరిస్తున్నారు. గోదావరిని తక్కువ అంచనా వేయడం సరికాదంటున్నారు.

First Published:  3 Oct 2019 6:53 AM GMT
Next Story