Telugu Global
NEWS

చంద్రబాబు వస్తారా? వస్తే ఏంచేస్తారు?

హుజూర్‌నగర్‌లో అన్ని కోణాల్లో ఆలోచించి చంద్రబాబు తన పార్టీ అభ్యర్థిని నిలబెట్టారు. అయితే నిలబెట్టిన అభ్యర్థి తరపున చంద్రబాబు ప్రచారానికి వస్తారా అన్నదే ఇప్పుడు ప్రశ్న. రావొచ్చు అని కొందరు, రాకపోవచ్చని కొందరు, వచ్చినా అలా హాయ్‌ హాయ్ చెప్పేసి వెళ్తారని మరికొందరు టీడీపీ నేతలు భావిస్తున్నారు. హుజూర్‌నగర్ లో చంద్రబాబు లెక్కలు గెలుపోటములకు అతీతమైనవి అని పార్టీ నేతలు ఇప్పటికే ఒక అంచనాకు వచ్చారు. కాంగ్రెస్‌తో తాను విడిపోయానని బీజేపీ పెద్దలకు సంకేతాలు పంపడం, అదే […]

చంద్రబాబు వస్తారా? వస్తే ఏంచేస్తారు?
X

హుజూర్‌నగర్‌లో అన్ని కోణాల్లో ఆలోచించి చంద్రబాబు తన పార్టీ అభ్యర్థిని నిలబెట్టారు. అయితే నిలబెట్టిన అభ్యర్థి తరపున చంద్రబాబు ప్రచారానికి వస్తారా అన్నదే ఇప్పుడు ప్రశ్న. రావొచ్చు అని కొందరు, రాకపోవచ్చని కొందరు, వచ్చినా అలా హాయ్‌ హాయ్ చెప్పేసి వెళ్తారని మరికొందరు టీడీపీ నేతలు భావిస్తున్నారు. హుజూర్‌నగర్ లో చంద్రబాబు లెక్కలు గెలుపోటములకు అతీతమైనవి అని పార్టీ నేతలు ఇప్పటికే ఒక అంచనాకు వచ్చారు.

కాంగ్రెస్‌తో తాను విడిపోయానని బీజేపీ పెద్దలకు సంకేతాలు పంపడం, అదే సమయంలో తన శిష్యుడు రేవంత్ రెడ్డికి తెలంగాణ పీసీసీ పోస్టు విషయంలో పోటీగా ఉన్న ఉత్తమ్‌ను హుజూర్‌నగర్‌లో దెబ్బతీయడమే…. చంద్రబాబు లెక్క అని చెబుతున్నారు. సొంత భార్యను గెలిపించుకోలేకపోతే ఉత్తమ్‌కు విలువ పడిపోతుందని… అప్పుడు రేవంత్ రెడ్డి పీసీసీ పీఠం ఎక్కుతారన్నది బాబు ఆలోచన.

ఈ నేపథ్యంలో ఆయన ప్రచారానికి వచ్చినా… రాకపోయినా…. ఆశ్చర్యం ఏమీ లేదంటున్నారు. చంద్రబాబు వచ్చినా అక్కడే తిష్టవేసి పార్టీ అభ్యర్థిని కనీసం రెండో స్థానానికి తెచ్చేంత చిత్తశుద్దిని కూడా ప్రదర్శించకపోవచ్చంటున్నారు. 2018 ఆఖరిలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేసిన నేపథ్యంలో….. ఇంతలోనే అక్కడికి వచ్చి కాంగ్రెస్‌ను ఓడించండి అని నోరారా చంద్రబాబు చెప్పలేని పరిస్థితి. టీఆర్‌ఎస్‌పై తొడకొట్టేంత సాహసమూ ఇప్పుడు చేయలేని స్థితి. ఇక బీజేపీ అంటే బాబు భయపడిపోతున్నారు.

సో.. హుజూర్‌నగర్‌లో బాబు జస్ట్‌… రేవంత్ రెడ్డి కోసం, బీజేపీ పెద్దల కోపం తగ్గించడం కోసమే అభ్యర్థిని నిలబెట్టినట్టు భావిస్తున్నారు.

First Published:  3 Oct 2019 6:55 AM GMT
Next Story