అటు నుంచి నరుక్కొచ్చారా? సైరాకు ఏపీ ప్రత్యేక అనుమతులు
చిరంజీవి, ఆయన కుమారుడు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సైరా నరసింహారెడ్డి చిత్రం అదనపు షోలకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మొదట ఏపీ ప్రభుత్వం అదనపు షోలకు అనుమతి ఇవ్వకపోవచ్చని ప్రచారం జరిగింది. గతంలో జగన్ అరెస్ట్ సమయంలో రామ్‌చరణ్… కాంగ్రెస్ ప్రభుత్వం మంచి పనిచేసిందంటూ కీర్తించడం, ఇటీవల తన ప్రమాణస్వీకారానికి ఆహ్వానించినా చిరంజీవి రాకపోవడం, చిరంజీవి తమ్ముడు పవన్ కల్యాణ్ నిత్యం ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న నేపథ్యంలో మెగా చిత్రానికి ఏపీ ప్రభుత్వం ప్రత్యేక అనుమతులు ఇవ్వకపోవచ్చని […]
చిరంజీవి, ఆయన కుమారుడు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సైరా నరసింహారెడ్డి చిత్రం అదనపు షోలకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మొదట ఏపీ ప్రభుత్వం అదనపు షోలకు అనుమతి ఇవ్వకపోవచ్చని ప్రచారం జరిగింది.
గతంలో జగన్ అరెస్ట్ సమయంలో రామ్‌చరణ్… కాంగ్రెస్ ప్రభుత్వం మంచి పనిచేసిందంటూ కీర్తించడం, ఇటీవల తన ప్రమాణస్వీకారానికి ఆహ్వానించినా చిరంజీవి రాకపోవడం, చిరంజీవి తమ్ముడు పవన్ కల్యాణ్ నిత్యం ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న నేపథ్యంలో మెగా చిత్రానికి ఏపీ ప్రభుత్వం ప్రత్యేక అనుమతులు ఇవ్వకపోవచ్చని భావించారు.
కానీ అవేవీ మనసులో పెట్టుకోకుండా ఏపీ ప్రభుత్వం సైరా నరసింహారెడ్డి చిత్రం అదనపు షోలకు అనుమతి ఇచ్చింది. రాత్రి ఒంటి గంట నుంచి ఉదయం 10 గంటల వరకు ఈ ప్రత్యేక షోలను ప్రదర్శిస్తారు.
రామ్‌చరణ్ బృందం కూడా కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంది. సైరా ప్రీరిలీజ్ పంక్షన్ ప్రసార హక్కులను జగన్ మోహన్ రెడ్డికి చెందిన సాక్షి టీవీకి ఇచ్చింది. మరికొన్ని చానళ్లు పోటీ పడినా సాక్షి పట్ల మొగ్గు చూపడానికి కారణం ఏపీ ప్రభుత్వం తమ పట్ల సానుకూలంగా స్పందించేలా చేసుకోవడమేనన్న అభిప్రాయం కూడా వ్యక్తమైంది. ప్రతికూల పరిస్థితుల్లో మెగా కుటుంబం అటు నుంచి నరుక్కొచ్చిందని చెబుతున్నారు.