Telugu Global
National

డ్యూటీ ఎగ్గొట్టి "సైరా"కు వెళ్లిన ఆరుగురు ఎస్‌ఐలపై వేటు వేసిన ఎస్పీ

సైరా నరసింహారెడ్డి సినిమా ఆరుగురు ఎస్‌ఐలను వీఆర్‌కు పంపించింది. కర్నూలు జిల్లాలో ఈ ఘటన జరిగింది. సైరా సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో తెల్లవారుజామునే జిల్లాలో ఆరుగురు ఎస్‌ఐలు సినిమాకు వెళ్లారు. డ్యూటీ ఎగ్గొట్టి మరీ ఈ పనిచేశారు. లీవ్‌ పెట్టకుండా, ముందస్తు అనుమతి కూడా తీసుకోకుండా కోవెలకుంట్లలో బెన్‌ఫిట్‌ షోకు ఆరుగురు ఎస్‌ఐలు వెళ్లారన్న విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప తీవ్రంగా స్పందించారు. ఆరుగురు ఎస్‌ఐలను వీఆర్‌కు పంపించారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులు ఇలా చెప్పాపెట్టకుండా […]

డ్యూటీ ఎగ్గొట్టి సైరాకు వెళ్లిన ఆరుగురు ఎస్‌ఐలపై వేటు వేసిన ఎస్పీ
X

సైరా నరసింహారెడ్డి సినిమా ఆరుగురు ఎస్‌ఐలను వీఆర్‌కు పంపించింది. కర్నూలు జిల్లాలో ఈ ఘటన జరిగింది. సైరా సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో తెల్లవారుజామునే జిల్లాలో ఆరుగురు ఎస్‌ఐలు సినిమాకు వెళ్లారు. డ్యూటీ ఎగ్గొట్టి మరీ ఈ పనిచేశారు.

లీవ్‌ పెట్టకుండా, ముందస్తు అనుమతి కూడా తీసుకోకుండా కోవెలకుంట్లలో బెన్‌ఫిట్‌ షోకు ఆరుగురు ఎస్‌ఐలు వెళ్లారన్న విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప తీవ్రంగా స్పందించారు. ఆరుగురు ఎస్‌ఐలను వీఆర్‌కు పంపించారు.

శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులు ఇలా చెప్పాపెట్టకుండా మాయమైతే సహించే ప్రసక్తే లేదని ఎస్పీ స్పష్టం చేశారు.

First Published:  2 Oct 2019 6:58 AM IST
Next Story