బక్కచిక్కి పోయిన రానా.... ట్రీట్మెంట్ ఎఫెక్టేనా?
కమర్షియల్ సినిమాలకు దూరంగా…. కంటెంట్ ఉన్న సినిమాలను మాత్రమే ఎంచుకుంటూ కెరీర్ లో ముందుకెళ్తున్నాడు రానా దగ్గుబాటి. అయితే ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా తర్వాత రానా మళ్లీ హీరోగా వెండితెరపై కనిపించింది లేదు. గత కొంతకాలంగా రానా కిడ్నీకి సంబంధించిన వ్యాధితో బాధ పడుతున్నాడని, దానివల్ల చాలా వెయిట్ కూడా లాస్ అయ్యాడనే వార్తలు వినిపించాయి. తాజాగా రానాకి సంబంధించిన ఒక ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ‘బాహుబలి’ సినిమాలో […]
కమర్షియల్ సినిమాలకు దూరంగా…. కంటెంట్ ఉన్న సినిమాలను మాత్రమే ఎంచుకుంటూ కెరీర్ లో ముందుకెళ్తున్నాడు రానా దగ్గుబాటి.
అయితే ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా తర్వాత రానా మళ్లీ హీరోగా వెండితెరపై కనిపించింది లేదు. గత కొంతకాలంగా రానా కిడ్నీకి సంబంధించిన వ్యాధితో బాధ పడుతున్నాడని, దానివల్ల చాలా వెయిట్ కూడా లాస్ అయ్యాడనే వార్తలు వినిపించాయి.
తాజాగా రానాకి సంబంధించిన ఒక ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ‘బాహుబలి’ సినిమాలో బల్లాల దేవుడి గా భారీగా కనిపించిన రానా ఈ ఫోటోలో మాత్రం బక్కచిక్కి పోయి కనిపించటం అభిమానులను సైతం షాక్ కి గురి చేస్తోంది.
తాజాగా ఇంటర్నెట్ లో లీకైన ఫోటోలో రానా చాలా సన్నగా గుర్తుపట్టలేనట్టుగా మారిపోయాడు. అయితే రానా బక్కగా అయిపోవడానికి కారణం సినిమా పాత్ర కోసం కాదని, కేవలం కిడ్నీ సంబంధిత ట్రీట్మెంట్ వల్ల అని తెలుస్తోంది.
గత మూడు నెలలుగా అమెరికాలో ఒక హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు రానా. కానీ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. అందుకే డాక్టర్లు మరొక నెలపాటు అమెరికాలోనే ఉండమని చెప్పారట. రానా ఇంకొక నెల పాటు అక్కడే ఉండబోతున్నాడు. పూర్తిగా కోలుకున్న తర్వాత వేణు ఉడుగుల దర్శకత్వంలో ‘విరాటపర్వం’ అనే సినిమా షూటింగ్ లో పాల్గొంటాడు రానా.
View this post on InstagramA post shared by Rana Daggubati (@ranadaggubati) on