Telugu Global
Cinema & Entertainment

సైరా ప్రీ-రిలీజ్ బిజినెస్ వివరాలు

సాహో సినిమాకు రేట్లు హైప్ చేశారనే టాక్ ఉండేది. కొంత బడ్జెట్ ఖర్చు పెట్టి, ఎంతో చెప్పారని ఫలితంగా ప్రీ-రిలీజ్ బిజినెస్ కు రెవెన్యూకు బ్యాలెన్స్ అవ్వలేదని చెబుతుంటారు ట్రేడ్ ఎనలిస్ట్ లు. సైరా విషయంలో మాత్రం ఇలాంటి అపోహలకు తావు లేదు. చిరంజీవి మార్కెట్, సినిమా బడ్జెట్ ను దృష్టిలో పెట్టుకొని రీజనబుల్ రేట్లకే ఏపీ, నైజాంలో సినిమాను అమ్మారు. తెలుగు రాష్ట్రాల్లో సాహో సినిమాను 120 కోట్ల రూపాయలకు అమ్మితే, సైరా సినిమాను వంద […]

సైరా ప్రీ-రిలీజ్ బిజినెస్ వివరాలు
X

సాహో సినిమాకు రేట్లు హైప్ చేశారనే టాక్ ఉండేది. కొంత బడ్జెట్ ఖర్చు పెట్టి, ఎంతో చెప్పారని ఫలితంగా ప్రీ-రిలీజ్ బిజినెస్ కు రెవెన్యూకు బ్యాలెన్స్ అవ్వలేదని చెబుతుంటారు ట్రేడ్ ఎనలిస్ట్ లు. సైరా విషయంలో మాత్రం ఇలాంటి అపోహలకు తావు లేదు.

చిరంజీవి మార్కెట్, సినిమా బడ్జెట్ ను దృష్టిలో పెట్టుకొని రీజనబుల్ రేట్లకే ఏపీ, నైజాంలో సినిమాను అమ్మారు. తెలుగు రాష్ట్రాల్లో సాహో సినిమాను 120 కోట్ల రూపాయలకు అమ్మితే, సైరా సినిమాను వంద కోట్ల రూపాయలకే అమ్మారు. అటు ఓవర్సీస్, నార్త్ లో కూడా సాహో కంటే తక్కువ రేట్లకే సైరాను అమ్మారు.

ఓవరాల్ గా వరల్డ్ వైడ్ 153 కోట్ల రూపాయల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసింది సైరా సినిమా. అంటే.. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఖర్చులు పోనూ కనీసం 160 కోట్ల రూపాయలు రావాలి. ప్రస్తుతం నడుస్తున్న హైప్ ప్రకారం చూసుకుంటే, ఇది ఏమంత పెద్ద కష్టం కాదనిపిస్తోంది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే, ఏపీ,నైజాంలో ఈ సినిమా 107 కోట్ల 90 లక్షల రూపాయలకు అమ్ముడుపోయింది. అడ్వాన్సులతో కలుపుకొని మొత్తం ఇది.

తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మాత్రం సైరా సినిమా సూపర్ హిట్ అవ్వాలి. విడుదలైన వారం రోజుల్లోనే కనీసం 60శాతం రెవెన్యూ రావాలి. మరోవైపు ఈ సినిమాకు సంబంధించి అదనపు షోలు లేవు. టిక్కెట్ రేట్లు పెంచినప్పటికీ అదనపు షోలు లేకపోవడంతో ఆ మేరకు వసూళ్లపై ప్రభావం పడబోతోంది. సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వస్తే, ఇలాంటి లెక్కలన్నీ కొట్టుకుపోతాయి. తెలుగు రాష్ట్రాల్లో సైరా ప్రీ-రిలీజ్ బిజినెస్ డీటెయిల్స్ ఇవి.

నైజాం – రూ. 30 కోట్లు
సీడెడ్ – రూ. 20 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 14.40 కోట్లు
ఈస్ట్ – రూ. 9.80 కోట్లు
వెస్ట్ – రూ. 8.40 కోట్లు
గుంటూరు – రూ. 11.50 కోట్లు
నెల్లూరు – రూ. 4.80 కోట్లు
కృష్ణా – రూ. 9 కోట్లు

First Published:  1 Oct 2019 5:22 AM IST
Next Story