Telugu Global
NEWS

ఎస్సీ ఎస్టీ బీసీ, కాపు యువతకు వాహనాలు.... ఇసుక రవాణాకు వాడకం

రెండు నెలల్లో ఇసుక సరఫరా వ్యవస్థ మొత్తం వ్యవస్థీకృతంగా గాడిన పడాల్సిందేనని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. స్పందన కార్యక్రమంపై సమీక్ష నిర్వహించిన సీఎం… ఇసుక ఇబ్బందులపై ప్రధానంగా ఆరా తీశారు. వరదల కారణంగా ఇసుక సరఫరాలో ఇబ్బందులు వచ్చాయని కలెక్టర్లు వివరించారు. ప్రస్తుతం వరదలు తగ్గినందున అన్ని ఇసుక రీచ్‌లను తెరవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇసుక మాఫియాలను ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దన్నారు. ఇసుక మాఫియా అన్నది కనిపించకూడదన్నారు. ఇసుక రవాణాలో ఎక్కడా రాజకీయ జోక్యానికి […]

ఎస్సీ ఎస్టీ బీసీ, కాపు యువతకు వాహనాలు.... ఇసుక రవాణాకు వాడకం
X

రెండు నెలల్లో ఇసుక సరఫరా వ్యవస్థ మొత్తం వ్యవస్థీకృతంగా గాడిన పడాల్సిందేనని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. స్పందన కార్యక్రమంపై సమీక్ష నిర్వహించిన సీఎం… ఇసుక ఇబ్బందులపై ప్రధానంగా ఆరా తీశారు. వరదల కారణంగా ఇసుక సరఫరాలో ఇబ్బందులు వచ్చాయని కలెక్టర్లు వివరించారు. ప్రస్తుతం వరదలు తగ్గినందున అన్ని ఇసుక రీచ్‌లను తెరవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

ఇసుక మాఫియాలను ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దన్నారు. ఇసుక మాఫియా అన్నది కనిపించకూడదన్నారు. ఇసుక రవాణాలో ఎక్కడా రాజకీయ జోక్యానికి తావుండకూడదని సీఎం తేల్చి చెప్పారు. పక్క రాష్ట్రాలకు ఇసుక తరలివెళ్లకుండా చెక్‌పోస్టుల వద్ద నిఘాను బలోపేతం చేయాలని ఆదేశించారు.

ఇసుక రవాణా, సరఫరాను జాయింట్ కలెక్టర్ స్థాయి అధికారికి జిల్లాల్లో అప్పగించాలని ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఎస్సీ ఎస్టీ బీసీ, కాపు యువతకు కార్పొరేషన్ల ద్వారా వాహనాలు కొనుగోలు చేయించి వారికి ఇసుక రవాణా బాధ్యతలను అప్పగించాలని ముఖ్యమంత్రి సూచించారు.

ఇలా దాదాపు రెండువేల మందిని ఇసుక రవాణాకు ఉపయోగించుకోవాలన్నారు. కిలోమీటర్‌కు రూ. 4.9 తో ఇసుక రవాణాకు ఎవరు ముందుకొచ్చినా వారికి అవకాశం ఇవ్వాలని ఆదేశించారు.

వాలంటీర్లు కూడా సచివాలయం ఉద్యోగాలు రాసి ఎంపిక అయి ఉండవచ్చని…. అలా ఖాళీ అయిన చోట కొత్త వారిని నియమించాలని జగన్ ఆదేశించారు. ఈనెల 15 నాటికి వాలంటీర్ల నియామకాలు పూర్తి చేయాలన్నారు.

డిసెంబర్‌ 1 నుంచి గ్రామ సచివాలయాలు పూర్తి స్థాయిలో పనిచేయాల్సి ఉంటుందని… అందుకు తగ్గట్టు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం అందజేత కార్యక్రమం ఈ నెల 4నుంచి ప్రారంభించనున్నారు. నేరుగా లబ్దిదారుల ఖాతాలోకే సొమ్ము జమ చేయనున్నారు.

First Published:  1 Oct 2019 11:03 AM IST
Next Story