Telugu Global
Cinema & Entertainment

సాహో విషయంలో.... శ్రద్ధ ఇలా!

సాధారణంగా ఒక సినిమా ప్లాప్ అయితే ఆ సినిమా కి పని చేసిన వాళ్ళు ఆ రిజల్ట్ ని మర్చిపోయి, ఆ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన అనుభవాలని మాత్రమే గుర్తు పెట్టుకుంటారు. మరీ దారుణం గా ఏదైనా ప్రాజెక్ట్ వలన బాధ కలిగితే అసలు ఆ ప్రాజెక్ట్ ఊసే ఎత్తడానికి ఇష్టపడరు. కాకపోతే ఇప్పుడు హిందీ హీరోయిన్ శ్రద్ధా కపూర్ సాహో సినిమా విషయం లో ప్రవర్తిస్తున్న తీరు చూస్తుంటే  విచిత్రం గా ఉంది. సాహో […]

సాహో విషయంలో.... శ్రద్ధ ఇలా!
X

సాధారణంగా ఒక సినిమా ప్లాప్ అయితే ఆ సినిమా కి పని చేసిన వాళ్ళు ఆ రిజల్ట్ ని మర్చిపోయి, ఆ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన అనుభవాలని మాత్రమే గుర్తు పెట్టుకుంటారు. మరీ దారుణం గా ఏదైనా ప్రాజెక్ట్ వలన బాధ కలిగితే అసలు ఆ ప్రాజెక్ట్ ఊసే ఎత్తడానికి ఇష్టపడరు. కాకపోతే ఇప్పుడు హిందీ హీరోయిన్ శ్రద్ధా కపూర్ సాహో సినిమా విషయం లో ప్రవర్తిస్తున్న తీరు చూస్తుంటే విచిత్రం గా ఉంది.

సాహో సినిమా శ్రద్ధా కపూర్ కి తెలుగు, తమిళం లో మొదటి సినిమా. అభిమానులు, విమర్శకులు శ్రద్ధ ని బాగా రిసీవ్ చేసుకున్నారు. సినిమా పరాజయం పాలైనా…. ఆ ప్రభావం ప్రభాస్, సుజీత్ ల మీద తప్ప వేరే ఎవరి మీదా పడలేదు. అయితే శ్రద్ధా కపూర్ అనవసరం గా ఉన్న గౌరవాన్ని పోగొట్టుకుంటుంది.

ఈ మధ్య ముంబై లో ఒక ప్రోగ్రాం లో పాల్గొన్న శ్రద్ధా కపూర్ ని ఆ కార్యక్రమం నిర్వహిస్తున్న హోస్ట్ సాహో సినిమా గురించి చెప్పుమనగా, ఆ ప్రశ్నని దాటవేస్తూ శ్రద్ధా కపూర్ చేసిన ప్రవర్తన ప్రభాస్ అభిమానులకు ఇబ్బంది కలిగించింది. నిజానికి శ్రద్ధ సాహో ప్రస్తావనని దాటవేయాల్సిన పరిస్థితి కి అసలు కారణాలేమీ లేవు. కావాలనే శ్రద్ధ ఇలా చేసినట్టు అనిపిస్తోంది.

సాహో పోయినందుకు బాధనా, లేక చిత్ర యూనిట్ తో ఏమైనా విభేదాలా అనే విషయం తెలియదు. అంతే కాకుండా సాహో ప్రస్తావన వచ్చినప్పుడు తన హిందీ సినిమా చిచోరే గురించి మాట్లాడి సాహోని సైడ్ చేయడంతో ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు.

First Published:  1 Oct 2019 7:48 AM IST
Next Story