Telugu Global
NEWS

పవన్ సినిమాల్లోకి.... అభిమానుల కోరికా అదేనా?

పవన్ సినిమాల్లోకి మళ్లీ వస్తాడని ప్రచారం జరగడం.. ఆయన రాను అని జనసేన పార్టీ తరుఫున క్లారిటీ ఇవ్వడం జరుగుతూనే ఉంది. అయితే ఎన్ని సార్లు పవన్ తాను సినిమాల్లోకి రానని చెబుతున్నా.. మళ్లీ మళ్లీ ఆయన వస్తున్నాడని గాసిప్పులు పుడుతూనే ఉన్నాయి. అయితే పవన్ సినిమాల్లోకి రానని అంటున్నా అతడి కోసం నిర్మాతలు, దర్శకులు మంచి కథలు రూపొందించి ఆయనను కలవడం.. తరచూ చర్చలు జరుపుతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. తాజాగా రాజకీయ సమావేశాల కంటే సినిమా […]

పవన్ సినిమాల్లోకి.... అభిమానుల కోరికా అదేనా?
X

పవన్ సినిమాల్లోకి మళ్లీ వస్తాడని ప్రచారం జరగడం.. ఆయన రాను అని జనసేన పార్టీ తరుఫున క్లారిటీ ఇవ్వడం జరుగుతూనే ఉంది. అయితే ఎన్ని సార్లు పవన్ తాను సినిమాల్లోకి రానని చెబుతున్నా.. మళ్లీ మళ్లీ ఆయన వస్తున్నాడని గాసిప్పులు పుడుతూనే ఉన్నాయి.

అయితే పవన్ సినిమాల్లోకి రానని అంటున్నా అతడి కోసం నిర్మాతలు, దర్శకులు మంచి కథలు రూపొందించి ఆయనను కలవడం.. తరచూ చర్చలు జరుపుతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది.

తాజాగా రాజకీయ సమావేశాల కంటే సినిమా కార్యక్రమాలలోనే పవన్ ఎక్కువగా కనిపిస్తున్నారు. పవన్ కు సినిమాల్లో నటించాలనే ఉద్దేశం లేకపోతే ఇలా ఎందుకు దర్శకులను కలుస్తాడనే చర్చ టాలీవుడ్ లో సాగుతోంది.

జనసేన పార్టీ తరుఫున ఏపీ రాజకీయాల్లోకి వచ్చిన పవన్ ప్రజలను పెద్దగా ఆకట్టుకోలేదు.. ఓ రకంగా ఫ్లాప్ అయ్యాడనే చెప్పాలి. దీంతో మళ్లీ సినిమాల్లోకి రావాలని స్వయంగా జనసైనికులే కోరుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే మళ్లీ సినిమాల్లోకి వస్తే తన నిబద్ధతను ప్రజలు శంకించే ప్రమాదం ఉందనే పవన్ వెనుకడుగు వేస్తున్నట్టు తెలుస్తోంది.

అయితే పవన్ సినిమాల్లోకి రావాలనుకుంటే వచ్చేయడమే బెటర్ అంటున్నారు అభిమానులు. రాజకీయాల్లో రాణించని పవన్ ను సినిమాల్లో మాత్రం అశేష జనావళి అందలం ఎక్కించింది. మొదట్లో కొన్ని విమర్శలు వచ్చినా క్రమంగా చల్లబడుతాయి. విమర్శలు, భయాలకు వెరవకుండా పవన్ త్వరగా నిర్ణయం తీసుకోవాలని జనసేన అభిమానులు, ప్రేక్షకులు కోరుతున్నారు.

First Published:  30 Sept 2019 11:20 AM IST
Next Story