కంగనా బోల్డ్ కామెంట్స్... క్షమాపణ చెబితే హృతిక్ తో కలుస్తాను...
కంగనా రౌనత్.. బాలీవుడ్ హీరోయిన్. అయితే ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో వివాదాల్లో నానుతుంటుంది. ముఖ్యంగా బోల్డ్ కామెంట్స్ చేస్తూ రచ్చ చేస్తుంటుంది.. తాజాగా ఢిల్లీలో నిర్వహించిన మైండ్ రాక్స్ అనే ఈవెంట్ లోనూ పాల్గొని చాలా బోల్డ్ కామెంట్స్ చేసింది. అవిప్పుడు వైరల్ గా మారాయి. సెక్స్ గురించి కుండబద్దలు కొట్టేలా వ్యాఖ్యానించిన కంగనా మాటలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి.. ‘నేను సెక్స్ విషయంలో చాలా యాక్టివ్ గా ఉంటానని తెలిసి… నా తల్లిదండ్రులు షాకయ్యారు. కానీ […]
కంగనా రౌనత్.. బాలీవుడ్ హీరోయిన్. అయితే ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో వివాదాల్లో నానుతుంటుంది. ముఖ్యంగా బోల్డ్ కామెంట్స్ చేస్తూ రచ్చ చేస్తుంటుంది.. తాజాగా ఢిల్లీలో నిర్వహించిన మైండ్ రాక్స్ అనే ఈవెంట్ లోనూ పాల్గొని చాలా బోల్డ్ కామెంట్స్ చేసింది. అవిప్పుడు వైరల్ గా మారాయి.
సెక్స్ గురించి కుండబద్దలు కొట్టేలా వ్యాఖ్యానించిన కంగనా మాటలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి.. ‘నేను సెక్స్ విషయంలో చాలా యాక్టివ్ గా ఉంటానని తెలిసి… నా తల్లిదండ్రులు షాకయ్యారు. కానీ అంత షాక్ అవ్వాల్సిన పనిలేదు.. పిల్లలకు సెక్స్ విషయంలో నాలెడ్జ్ ఉన్నందుకు వారు సంతోషించాలి.. సెక్స్ ను బాధ్యతగా ఫీలవ్వాలి. సెక్స్ లో పాల్గొనమని తల్లిదండ్రులే ప్రోత్సహించాలి’ అంటూ కంగనా చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. సెక్స్ చేయాలనిపిస్తే చేసేయండి అంటూ యూత్ కు పిలుపునివ్వడం దుమారం రేపింది.
ఇక తన తొలిముద్దును 17ఏళ్లకే పెట్టానని కంగనా చెప్పుకొచ్చింది. ఓ 28 ఏళ్ల పంజాబీ అబ్బాయి అందానికి పడిపోయి అతడితో రిలేషన్ లో ఉన్నానని.. తొలిసారి ముద్దు పెట్టేటప్పుడు చాలా టెన్షన్ పడ్డానని కంగనా తన తొలిముద్దుపై నిర్మొహమాటంగా చెప్పుకొచ్చింది.
ఇప్పటికే హృతిక్ రోషన్ తో డేటింగ్ చేసిన కంగనా.. అతడితో విభేదాల కారణంగా విడిపోయింది. వీరి మధ్య వివాదం పతాక స్థాయికి చేరింది. మళ్లీ సారి చెబితే హృతిక్ తో కలవడానికి తనకు ఇబ్బంది లేదని కంగనా ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పడం కొసమెరుపు.