టీడీపీకి సిద్ధాంతం లేదు... ఆత్మ లేదు " దేవేందర్ గౌడ్ కుమారుడు ఘాటు లేఖ
ఉమ్మడి ఏపీ మాజీ హోంమంత్రి దేవేందర్ గౌడ్ కుమారుడు వీరేందర్ గౌడ్ టీడీపీకి రాజీనామా చేశారు. రాజీనామా చేస్తూ చంద్రబాబుకు ఘాటు లేఖ రాశారు. టీడీపీకి సిద్ధాంతాలు లేకుండాపోయాయని విమర్శించారు. పార్టీకి అసలు ఆత్మే లోపించిందని అభిప్రాయపడ్డారు. ఉన్నత ఆదర్శాలు, సిద్ధాంతాలతో ఎన్టీఆర్ పార్టీని స్థాపించారని… కానీ కొంతకాలంగా వివిధ రాజకీయ అవసరాల కోసం ఎన్టీఆర్ సిద్ధాంతాలకు భిన్నంగా టీడీపీ నడుస్తోందని లేఖలో ఆవేదన చెందారు. ఇలాంటి పరిస్థితి తనను ఎంతగానో బాధించిందన్నారు. పార్టీకి సిద్ధాంతాలు లేకపోవడం […]

ఉమ్మడి ఏపీ మాజీ హోంమంత్రి దేవేందర్ గౌడ్ కుమారుడు వీరేందర్ గౌడ్ టీడీపీకి రాజీనామా చేశారు. రాజీనామా చేస్తూ చంద్రబాబుకు ఘాటు లేఖ రాశారు. టీడీపీకి సిద్ధాంతాలు లేకుండాపోయాయని విమర్శించారు.
పార్టీకి అసలు ఆత్మే లోపించిందని అభిప్రాయపడ్డారు. ఉన్నత ఆదర్శాలు, సిద్ధాంతాలతో ఎన్టీఆర్ పార్టీని స్థాపించారని… కానీ కొంతకాలంగా వివిధ రాజకీయ అవసరాల కోసం ఎన్టీఆర్ సిద్ధాంతాలకు భిన్నంగా టీడీపీ నడుస్తోందని లేఖలో ఆవేదన చెందారు.
ఇలాంటి పరిస్థితి తనను ఎంతగానో బాధించిందన్నారు. పార్టీకి సిద్ధాంతాలు లేకపోవడం అన్నది ఆత్మ లేకపోవడమేనని… ఈ నేపథ్యంలో పార్టీలో తాను కొనసాగలేక ప్రాథమిక సభ్యత్వానికి, తెలుగు యువత అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్టు వీరేందర్ గౌడ్ వివరించారు.