ప్రజాస్వామ్యాన్ని కాపాడిన గొప్ప వ్యక్తి కోడెల " సీపీఐ నారాయణ
ఇటీవల ఆత్మహత్య చేసుకున్న మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు సంస్మరణ సభ హైదరాబాద్‌లో జరిగింది. ఆ కార్యక్రమానికి పలువురు టీడీపీ నేతలు, కోడెల అభిమానులు హాజరయ్యారు. సీపీఐ సీనియర్ నేత నారాయణ కూడా ఈ కార్యక్రమానికి హజరై ప్రసంగించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడిన గొప్ప వ్యక్తి కోడెల శివప్రసాదరావు అని నారాయణ కీర్తించారు. పల్నాడులో అరాచకం పెచ్చుమీరిన తరుణంలో రాజకీయాల్లోకి వచ్చి ప్రజాస్వామ్యాన్ని కాపాడారని చెప్పారు. కోడెల ఆత్మహత్య చేసుకునేంత పిరికి వాడు కాదన్నారు. తీసుకెళ్లిన ఫర్నిచర్ తిరిగి […]
ఇటీవల ఆత్మహత్య చేసుకున్న మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు సంస్మరణ సభ హైదరాబాద్‌లో జరిగింది. ఆ కార్యక్రమానికి పలువురు టీడీపీ నేతలు, కోడెల అభిమానులు హాజరయ్యారు. సీపీఐ సీనియర్ నేత నారాయణ కూడా ఈ కార్యక్రమానికి హజరై ప్రసంగించారు.
ప్రజాస్వామ్యాన్ని కాపాడిన గొప్ప వ్యక్తి కోడెల శివప్రసాదరావు అని నారాయణ కీర్తించారు. పల్నాడులో అరాచకం పెచ్చుమీరిన తరుణంలో రాజకీయాల్లోకి వచ్చి ప్రజాస్వామ్యాన్ని కాపాడారని చెప్పారు. కోడెల ఆత్మహత్య చేసుకునేంత పిరికి వాడు కాదన్నారు. తీసుకెళ్లిన ఫర్నిచర్ తిరిగి ఇస్తానని చెప్పిన తర్వాత కూడా కోడెలపై దొంగతనం కేసు పెట్టడం ఏమిటని నారాయణ ప్రశ్నించారు. కోడెల మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
అయితే స్పీకర్ స్థానంలో ఉంటూ 23 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయకపోవడం, అసెంబ్లీలో ప్రతిపక్షం పట్ల ఆయన వ్యవహరించిన తీరు, సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల్లో కోడెల కుటుంబం వసూలు చేసిన కే- టాక్స్, రాష్ట్ర వ్యాప్తంగా కోడెల కుమార్తె కంపెనీ నుంచి నాసిరకం మందులు పశువులకు సరఫరా చేయడం, సామాన్యులు ఇల్లు కట్టుకోవాలన్నా కోడెల టాక్స్ కట్టాల్సి రావడం, తోపుడు బండ్లపై వ్యాపారం చేసుకునే వారు కూడా మామూళ్లు కట్టాల్సి రావడం, ప్రముఖ టీవీ చానళ్లను కోడెల శివరాం శాటిలైట్ పైరసీ చేసిన విధానం, స్కిల్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన కంప్యూటర్లు ఎత్తుకెళ్లి కోడెల ఇంట్లో పెట్టుకోవడం, వాహనాలకు తప్పుడు విధానంలో కోడెల కుమారుడు రిజిస్ట్రేషన్లు చేయడం, మామూళ్లు ఇవ్వలేదని ఏకంగా రైల్వే కాంట్రాక్టర్లనే బెదిరించడం… అందుకే కేంద్ర రైల్వే శాఖ తీవ్రంగా స్పందించి నాటి సీఎస్‌కు లేఖ రాయడం, కోడెల ఆస్పత్రిలో బాంబులు పేలి ఇద్దరు చనిపోవడం, స్పీకర్ హోదాలో ఇతర పార్టీల నేతలకు టీడీపీ కండువాలు కప్పడం, 2014 ఎన్నికల్లో గెలిచేందుకు తాను 11.5 కోట్లు ఖర్చు పెట్టానని స్పీకర్ హోదాలోనే కోడెల ఒక ఇంటర్వ్యూలో చెప్పడం, కమ్మవాళ్లు అధికారంలో సుధీర్ఘ కాలం ఉండేలా కృషి చేయాలని కుల సమావేశాల్లో స్పీకర్ హోదాలో పిలుపునివ్వడం వంటి అంశాలను మాత్రం ఈ కార్యక్రమంలో ప్రస్తావించకుండా వక్తలు సంయమనం పాటించారు.