Telugu Global
NEWS

హోరాహోరీగా ప్రో-కబడ్డీలీగ్ సమరం

జైపూర్ కు తెలుగు టైటాన్స్ షాక్  యూ-ముంబాకు బెంగళూరు బుల్స్ దెబ్బ ప్రో-కబడ్డీలీగ్ 7వ సీజన్ జైపూర్ అంచె పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. ప్లే- అఫ్ రౌండ్ చేరే మొదటి ఐదుజట్లు ఏవో తేల్చుకోడానికి… మొత్తం 10 జట్లు అమీతుమీకి సిద్ధమయ్యాయి. జైపూర్ సవాయ్ మాన్ సింగ్ స్టేడియం వేదికగా జరిగిన ప్రస్తుత సీజన్ ఆఖరి అంచె పోటీలలో…ప్రస్తుత చాంపియన్ బెంగళూరు బుల్స్, తెలుగు టైటాన్స్ జట్లు భారీ విజయాలు నమోదు చేశాయి. ఉత్కంఠభరితంగా సాగిన సమరంలో బెంగళూరు బుల్స్ […]

హోరాహోరీగా ప్రో-కబడ్డీలీగ్ సమరం
X
  • జైపూర్ కు తెలుగు టైటాన్స్ షాక్
  • యూ-ముంబాకు బెంగళూరు బుల్స్ దెబ్బ

ప్రో-కబడ్డీలీగ్ 7వ సీజన్ జైపూర్ అంచె పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. ప్లే- అఫ్ రౌండ్ చేరే మొదటి ఐదుజట్లు ఏవో తేల్చుకోడానికి… మొత్తం 10 జట్లు అమీతుమీకి సిద్ధమయ్యాయి.

జైపూర్ సవాయ్ మాన్ సింగ్ స్టేడియం వేదికగా జరిగిన ప్రస్తుత సీజన్ ఆఖరి అంచె పోటీలలో…ప్రస్తుత చాంపియన్ బెంగళూరు బుల్స్, తెలుగు టైటాన్స్ జట్లు భారీ విజయాలు నమోదు చేశాయి.

ఉత్కంఠభరితంగా సాగిన సమరంలో బెంగళూరు బుల్స్ 35-33 పాయింట్ల తేడాతో యూ-ముంబాను అధిగమించి..లీగ్ టేబుల్ మొదటి నాలుగు స్థానాలలో తన చోటును మరింత పదిలం చేసుకోగలిగింది.

స్టార్ రైడర్ పవన్ షెరావత్ అత్యధిక రైడింగ్ పాయింట్లు సాధించి తన జట్టు విజయంలో ప్రధానపాత్ర వహించాడు. బ్లాకింగ్ లో సైతం బెంగళూరు 10 పాయింట్లు సంపాదించింది.

ఇప్పటి వరకూ 19 మ్యాచ్ లు ఆడిన బెంగళూరు మొత్తం 59 పాయింట్లతో లీగ్ టేబుల్ నాలుగోస్థానంలో నిలిచింది.
యూ-ముంబా మాత్రం 54 పాయింట్లతో 5వ స్థానంలో కొనసాగుతోంది.

తెలుగు టైటాన్స్ కంటితుడుపు గెలుపు..

ప్రస్తుత సీజన్ లీగ్ లో వరుస వైఫల్యాలతో ప్లే ఆఫ్ రౌండ్ కు దూరమైన తెలుగు టైటాన్స్…ఎట్టకేలకు ఓ భారీవిజయం నమోదు చేసింది.

ఆతిథ్య జైపూర్ పింక్ పాంథర్స్ తో జరిగిన పోటీలో తెలుగు టైటాన్స్ 51-31 పాయింట్ల తేడాతో విజేతగా నిలిచింది.

కెప్టెన్ కమ్ స్టార్ రైడర్ సిద్ధార్థ దేశాయ్ ఒక్కడే 22 పాయింట్లతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. రజనీశ్ దలాల్ 11 పాయింట్లతో తనవంతు పాత్ర నిర్వర్తించాడు.

మొత్తం 12 జట్ల లీగ్ లో మొదటి 19 రౌండ్ల మ్యాచ్ లు ముగిసే సమయానికి మాజీ చాంపియన్ జైపూర్ పింక్ పాంథర్స్ 7వ స్థానంలోనూ, తెలుగు టైటాన్స్ 11వ స్థానంలోనూ నిలిచాయి.

First Published:  29 Sept 2019 4:45 AM IST
Next Story