కొరియన్ ఓపెన్ సెమీస్ లో ముగిసిన కశ్యప్ పోటీ
ప్రపంచ నంబర్ వన్ చేతిలో కశ్యప్ చిత్తు 2019 కొరియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత క్రీడాకారుల పోటీ ముగిసింది. సైనా, సింధు, ప్రణీత్ లాంటి క్రీడాకారులు ప్రారంభ రౌండ్లలోనే నిష్క్ర్రమించినా.. పురుషుల సింగిల్స్ లో పారుపల్లి కశ్యప్ మాత్రం అంచనాలకు మించి రాణించడం ద్వారా సెమీస్ కు అర్హత సంపాదించాడు. అయితే…జపాన్ స్టార్ ప్లేయర్, ప్రపంచ నంబర్ వన్ ర్యాంకర్ కెంటో మొమాటో చేతిలో కశ్యప్ కు వరుస గేమ్ ల పరాజయం తప్పలేదు. ఏకపక్షంగా సాగిన […]
- ప్రపంచ నంబర్ వన్ చేతిలో కశ్యప్ చిత్తు
2019 కొరియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత క్రీడాకారుల పోటీ ముగిసింది. సైనా, సింధు, ప్రణీత్ లాంటి క్రీడాకారులు ప్రారంభ రౌండ్లలోనే నిష్క్ర్రమించినా.. పురుషుల సింగిల్స్ లో పారుపల్లి కశ్యప్ మాత్రం అంచనాలకు మించి రాణించడం ద్వారా సెమీస్ కు అర్హత సంపాదించాడు.
అయితే…జపాన్ స్టార్ ప్లేయర్, ప్రపంచ నంబర్ వన్ ర్యాంకర్ కెంటో మొమాటో చేతిలో కశ్యప్ కు వరుస గేమ్ ల పరాజయం తప్పలేదు.
ఏకపక్షంగా సాగిన ఈ పోరులో ప్రపంచ చాంపియన్ కెంటో మొమాటో 21-13, 21-15తో కశ్యప్ ను చిత్తు చేయడం ద్వారా… ఫైనల్స్ బెర్త్ తో పాటు… 2020 టోక్యో ఒలింపిక్స్ కు సైతం అర్హత సంపాదించగలిగాడు.
ఫైనల్లో చైనీస్ తైపీ ప్లేయర్ చో టిన్ చెన్ తో మొమోటో తలపడనున్నాడు. తెలుగుతేజం పారుపల్లి కశ్యప్ ఇటీవలి కాలంలో ఓ గ్రాండ్ ప్రీ టోర్నీ సెమీస్ చేరడం ఇదే మొదటిసారి.