Telugu Global
National

ఆధార్ తో పాన్.... గడువు పొడిగింపు

పాన్ ని ఆధార్ తో అనుసంధానించడానికి మళ్లీ గడువును పోడిగించారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్స్ (సిబిడిటి) సెప్టెంబర్ 28 న శాశ్వత ఖాతా నంబర్ (పాన్) ను ఆధార్‌తో అనుసంధానం చేయడానికి గడువును డిసెంబర్ 31 వరకు పొడిగించింది. అంతకుముందు విధించిన గడువు సెప్టెంబర్ 30. పాన్‌ను ఆధార్‌తో అనుసంధానించడానికి గడువును ప్రభుత్వం పొడిగించడం ఇది ఏడవసారి. ఆదాయపు పన్ను ప్రయోజనాల కోసం రెండు ప్రత్యేకమైన ఐడిలను లింక్ చేయడం ఇప్పుడు తప్పనిసరి. దీనికి […]

ఆధార్ తో పాన్.... గడువు పొడిగింపు
X

పాన్ ని ఆధార్ తో అనుసంధానించడానికి మళ్లీ గడువును పోడిగించారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్స్ (సిబిడిటి) సెప్టెంబర్ 28 న శాశ్వత ఖాతా నంబర్ (పాన్) ను ఆధార్‌తో అనుసంధానం చేయడానికి గడువును డిసెంబర్ 31 వరకు పొడిగించింది. అంతకుముందు విధించిన గడువు సెప్టెంబర్ 30.

పాన్‌ను ఆధార్‌తో అనుసంధానించడానికి గడువును ప్రభుత్వం పొడిగించడం ఇది ఏడవసారి.

ఆదాయపు పన్ను ప్రయోజనాల కోసం రెండు ప్రత్యేకమైన ఐడిలను లింక్ చేయడం ఇప్పుడు తప్పనిసరి. దీనికి సంబంధించి సెప్టెంబర్ 27 న నోటిఫికేషన్ జారీ చేసినట్లు ఆదాయపు పన్ను శాఖ విధాన రూపకల్పన సంస్థ తెలిపింది.

సుప్రీంకోర్టు 2018 సెప్టెంబరులో కేంద్రప్రభుత్వ ముఖ్యమైన ఆధార్ పథకాన్ని రాజ్యాంగబద్ధంగా చెల్లుబాటు అవుతుందని ప్రకటించింది. ఐ-టి రిటర్న్స్ దాఖలు చేయడానికి, పాన్ కేటాయింపుకు బయోమెట్రిక్ ఐడి తప్పనిసరి అని పేర్కొంది.

ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 139 ఆఆ (2) ప్రకారం, జూలై 1, 2017 నాటికి పాన్ ఉన్న, ఆధార్ పొందటానికి అర్హత ఉన్న ప్రతి వ్యక్తి తన ఆధార్ నంబర్‌ను పన్ను అధికారులకు తెలియజేయాలి.

భారతదేశ నివాసికి ఆధార్‌ను యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యుఐడిఎఐ) జారీ చేస్తుంది. అలాగే పాన్ అనేది ఒక వ్యక్తి, లేదా సంస్థకు ఐటి విభాగం కేటాయించిన 10-అంకెల ఆల్ఫాన్యూమరిక్ నంబర్.

First Published:  29 Sept 2019 5:33 PM IST
Next Story