Telugu Global
NEWS

తప్పుకుంటారా? తప్పించమంటారా?

ప్రభుత్వం మారినా కొందరు టీడీపీ నేతలు సీట్లు వదలడం లేదు. నామినేటెడ్‌ పదవులను అలాగే అంటిపెట్టుకుని ఉంటున్నారు. చాలా మంది స్వచ్ఛందంగా తప్పుకుంటున్నా మరికొందరు మాత్రం తాము సీటు వదిలేది లేదంటున్నారు. చంద్రబాబు సీఎం అయిన కొత్తలో అప్పటి వరకు పలు పదవుల్లో ఉన్న వారు రోజుల వ్యవధిలోనే పదవులు వదిలేశారు. లేకుంటే అలాంటి వారిపై కక్షపూరితంగా చంద్రబాబు వేధించి వెళ్ళగొట్టేవాడు. జగన్‌ మాత్రం తాను అందరినీ సమ దృష్టితో చూస్తాను… వేధింపులు ఉండవు… అంటూ ప్రకటించుకోవడంతో […]

తప్పుకుంటారా? తప్పించమంటారా?
X

ప్రభుత్వం మారినా కొందరు టీడీపీ నేతలు సీట్లు వదలడం లేదు. నామినేటెడ్‌ పదవులను అలాగే అంటిపెట్టుకుని ఉంటున్నారు. చాలా మంది స్వచ్ఛందంగా తప్పుకుంటున్నా మరికొందరు మాత్రం తాము సీటు వదిలేది లేదంటున్నారు.

చంద్రబాబు సీఎం అయిన కొత్తలో అప్పటి వరకు పలు పదవుల్లో ఉన్న వారు రోజుల వ్యవధిలోనే పదవులు వదిలేశారు. లేకుంటే అలాంటి వారిపై కక్షపూరితంగా చంద్రబాబు వేధించి వెళ్ళగొట్టేవాడు. జగన్‌ మాత్రం తాను అందరినీ సమ దృష్టితో చూస్తాను… వేధింపులు ఉండవు… అంటూ ప్రకటించుకోవడంతో టీడీపీ నేతలకు ధైర్యం వచ్చేసింది.

జగన్‌ ప్రభుత్వం ఏమీ చేయలేదన్న ధీమా ఒక వైపు… ఒకవేళ చర్యలు తీసుకుంటే ప్రభుత్వం కక్ష సాధిస్తోంది అంటూ గగ్గోలు పెట్టవచ్చన్న భావన మరోవైపు టీడీపీలో బలంగా ఉంది. అందుకే ఇప్పటికీ కొందరు నామినేటెడ్ పదవులను అంటిపెట్టుకునే ఉన్నారు. ఏపీఎస్‌ ఆర్టీసీ చైర్మన్‌ వర్ల రామయ్య కూడా ఇప్పటికీ ఆ పదవికి రాజీనామా చేయలేదు. ప్రభుత్వం మారి దాదాపు నాలుగు నెలలు అవుతున్నా వర్ల రామయ్య ఆర్టీసీని వదలలేదు.

పైగా వీలు చిక్కినప్పుడల్లా ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో దుమ్మెత్తిపోస్తూనే ఉన్నాడు. టీడీపీ నేత అయినప్పటికీ ఆర్టీసీ చైర్మన్‌గా ఇప్పటికీ కొనసాగడమే కాకుండా… తిరిగి ప్రభుత్వాన్నే తిట్టడం చేస్తున్న వర్ల రామయ్యపై ఎట్టకేలకు ప్రభుత్వం దృష్టి సారించింది.

ఆర్టీసీ చైర్మన్‌ పదవికి నెల రోజుల్లోగా స్వచ్చందంగా రాజీనామా చేయాలని నోటీసులు జారీ చేసింది. నెల రోజుల్లో తప్పుకోకపోతే తామే తొలగించాల్సి ఉంటుందని ప్రభుత్వం నోటీసుల్లో వెల్లడించింది. ఏ నిబంధన ప్రకారం తప్పుకోవాలో కూడా నోటీసుల్లో ప్రభుత్వం వివరించింది.

అయితే వర్ల రామయ్య స్వచ్చందంగా తప్పుకుంటారా?, అందుకు చంద్రబాబు అంగీకరిస్తారా?, ఈ అంశం ఆధారంగానూ రాజకీయం చేసేందుకు చంద్రబాబు ఆసక్తి చూపుతారా? అన్నది చూడాలి.

First Published:  28 Sept 2019 12:24 AM GMT
Next Story