ఉత్తమ్ కు షాక్ ఇవ్వబోతున్న చంద్రబాబు
హుజూర్ నగర్ లో కాంగ్రెస్ అభ్యర్థిగా తన భార్య పద్మావతిని నిలబెట్టిన పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి అదిరిపోయే షాక్ తగలడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఆమెకు మద్దతు ఇవ్వాలని టీజేఎస్ కోదండరాం, ప్రజాసంఘాలను, సీపీఐ, సీపీఎంలను ఉత్తమ్ కోరాడు. అయితే ప్రజాసంఘాల తరుఫున తీన్మార్ మల్లన్న ఎమ్మెల్యేగా నిలబడుతున్నారు. సీపీఐ, సీపీఎం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇక మొన్నటి ఎన్నికల్లో మహాకూటమిలో కలిసి పోటీచేసిన టీడీపీతోనూ ఉత్తమ్ సంప్రదింపులు జరిపాడు. ఆంధ్రాకు సరిహద్దుల్లో ఉన్న […]
హుజూర్ నగర్ లో కాంగ్రెస్ అభ్యర్థిగా తన భార్య పద్మావతిని నిలబెట్టిన పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి అదిరిపోయే షాక్ తగలడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఆమెకు మద్దతు ఇవ్వాలని టీజేఎస్ కోదండరాం, ప్రజాసంఘాలను, సీపీఐ, సీపీఎంలను ఉత్తమ్ కోరాడు. అయితే ప్రజాసంఘాల తరుఫున తీన్మార్ మల్లన్న ఎమ్మెల్యేగా నిలబడుతున్నారు. సీపీఐ, సీపీఎం ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
ఇక మొన్నటి ఎన్నికల్లో మహాకూటమిలో కలిసి పోటీచేసిన టీడీపీతోనూ ఉత్తమ్ సంప్రదింపులు జరిపాడు. ఆంధ్రాకు సరిహద్దుల్లో ఉన్న హుజూర్ నగర్ లో ఆంధ్రా వారి ప్రాబల్యం ఎక్కువ. అందుకే టీడీపీ సపోర్టు కూడా ఇవ్వాలని ఉత్తమ్ తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబును కోరారు.
అయితే తాజాగా హుజూర్ నగర్ లో పోటీచేసే విషయంపై చంద్రబాబు అక్కడి స్థానిక తెలంగాణ నేతల అభిప్రాయాలు సేకరిస్తున్నారు. హుజూర్ నగర్ లో బలం ఉందని.. టీడీపీ తరుఫున అభ్యర్థిని పోటీకి దింపాలని పలువురు నేతలు ఆయనకు సూచించారట.. పోటీచేస్తేనే టీడీపీ క్యాడర్ నిలుపుకుంటుందని.. లేకపోతే నిలుపుకోదని టీడీపీ నేతలు కుండబద్దలు కొట్టినట్టు తెలిసింది.
దీంతో చంద్రబాబు హుజూర్ నగర్ లో అభ్యర్థిని పోటీకి దించడంపై సానుకూలంగా ఉన్నట్టు సమాచారం. ఈ భేటిలోనే హుజూర్ నగర్ టీడీపీ అభ్యర్థులుగా నస్నూరి నర్సిరెడ్డి, చావా కిరణ్మయిల పేర్లను పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది.