నెటిజన్లకు షాక్ ఇస్తున్న రకుల్
ఈ మధ్యకాలంలో సినిమాలలో మాత్రమే కాక సోషల్ మీడియాలో కూడా ఎక్కువగానే కనిపిస్తున్న స్టార్ హీరోయిన్ లలో రకుల్ ప్రీత్ కూడా ఒక్కరు. ‘మన్మధుడు 2’ సినిమా తో భారీ ఫ్లాప్ ను అందుకుంది. అయితే తాజాగా ఈమె సోషల్ మీడియాలో తన ఫొటోలతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రకుల్ ప్రీత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ కనిపించిన ఈ వీడియోలో 175 […]

ఈ మధ్యకాలంలో సినిమాలలో మాత్రమే కాక సోషల్ మీడియాలో కూడా ఎక్కువగానే కనిపిస్తున్న స్టార్ హీరోయిన్ లలో రకుల్ ప్రీత్ కూడా ఒక్కరు. ‘మన్మధుడు 2’ సినిమా తో భారీ ఫ్లాప్ ను అందుకుంది.
అయితే తాజాగా ఈమె సోషల్ మీడియాలో తన ఫొటోలతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
రకుల్ ప్రీత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ కనిపించిన ఈ వీడియోలో 175 పౌండ్స్ డెడ్ లిఫ్ట్ చేసి అందరినీ షాక్ కి గురి చేసింది.
టాలీవుడ్ హీరోయిన్ లలో ఫిట్నెస్ ఫ్రీక్ అంటే ముందుగా మనకు గుర్తొచ్చే పేరు రకుల్ ప్రీత్. ఎప్పుడు ఖాళీ సమయం దొరికినా జిమ్ లో వర్కవుట్ చేయడం పై దృష్టి పెట్టే రకుల్ ప్రీత్… ఈ వీడియోలో మల్టీకలర్ స్పోర్ట్స్ బ్రా, బ్లాక్ టైట్స్ వేసుకుని 175 పౌండ్స్ ని అవలీలగా ఎత్తేస్తూ అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది.
ఈ వీడియో షేర్ చేస్తూ, “నేను ఫిట్ నెస్ గా ఉండేందుకు మరొక ప్రయత్నం. ఈ సారి 175 పౌండ్స్ తో” అంటూ క్యాప్షన్ పెట్టింది రకుల్ ప్రీత్. ఇక సినిమాల పరంగా చూస్తే రకుల్ ‘మర్ జావా’ అనే హిందీ సినిమాతోనే కాక ‘ఇండియన్ 2’ తో కూడా బిజీ గా ఉంది.
Andd another attempt to perfect my form!! This time with 175 pounds ???? thanks #joelmoss ?? #kunalgir DEAD after #deadlift .. #gymlover? #strongissexy?
Posted by Rakul Preet on Friday, 27 September 2019