Telugu Global
Cinema & Entertainment

ఫ్లాపుల నుంచి ఫిలాసఫీ నేర్చుకుంది

మెహ్రీన్.. గోల్డెన్ స్పూన్ తో పుట్టిన అమ్మాయి. ఎన్నారై రిటర్న్. సినిమాల్లోకి వచ్చేవరకు కష్టమంటే ఏంటో తెలీదు. వచ్చిన తర్వాత కూడా మొదటి సినిమా హిట్ అవ్వడంతో ఆమెకు కష్టం తెలియలేదు. ఎప్పుడైతే వరుసగా ఫ్లాపులొచ్చాయో అప్పట్నుంచి కుంగిపోవడం స్టార్ట్ అయింది. ఆ పరాజయాల నుంచే తత్వం తెలుసుకుంది. అప్పటి ఫ్లాపుల్ని మరోసారి గుర్తుచేసుకుంది. ఓటమి సహజం అంటోంది. “నా కెరీర్ స్టార్టింగ్ బాగానే ఉన్నా మధ్యలో కొన్ని సినిమాలు నిరాశ పరిచాయి. ఇక లైఫ్ అంటే […]

ఫ్లాపుల నుంచి ఫిలాసఫీ నేర్చుకుంది
X

మెహ్రీన్.. గోల్డెన్ స్పూన్ తో పుట్టిన అమ్మాయి. ఎన్నారై రిటర్న్. సినిమాల్లోకి వచ్చేవరకు కష్టమంటే ఏంటో తెలీదు. వచ్చిన తర్వాత కూడా మొదటి సినిమా హిట్ అవ్వడంతో ఆమెకు కష్టం తెలియలేదు. ఎప్పుడైతే వరుసగా ఫ్లాపులొచ్చాయో అప్పట్నుంచి కుంగిపోవడం స్టార్ట్ అయింది. ఆ పరాజయాల నుంచే తత్వం తెలుసుకుంది. అప్పటి ఫ్లాపుల్ని మరోసారి గుర్తుచేసుకుంది. ఓటమి సహజం అంటోంది.

“నా కెరీర్ స్టార్టింగ్ బాగానే ఉన్నా మధ్యలో కొన్ని సినిమాలు నిరాశ పరిచాయి. ఇక లైఫ్ అంటే కష్టాలు కామనే కదా. సో జరిగిన దాని గురించి లైట్ తీసుకొని జరగబోయేది ఆలోచిస్తూ ముందుకు వెళ్ళడం అలవాటు చేసుకున్నాను.”

చాణక్య సినిమా ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడిన మెహ్రీన్, ఇలా అప్పటి తన ఫ్లాపుల పరంపర గురించి ప్రస్తావించింది. గోపీచంద్ తో వర్క్ చేయడం ఎప్పుడూ బాగుంటుందని, అంత కామ్ గా వర్క్ చేసే హీరోను ఇప్పటివరకు చూడలేదంటోంది.

“గోపీచంద్ తో ఇది సెకండ్ సినిమా. ‘పంతం’ సినిమా తర్వాత మళ్ళీ ఆయనతో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. షూటింగ్ లో ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను. షూటింగ్ అయ్యాక చాలా సైలెంట్ గా ఉంటారు. పక్కన కూర్చొని ఆయన పనేదో ఆయన చేసుకుంటారు. చాణక్య సినిమాలో రామకృష్ణ , విజయ్ గా అందరినీ మెప్పిస్తాడు.”

అనీల్ సుంకరకు చెందిన 14 రీల్స్ బ్యానర్ పైనే తను హీరోయిన్ గా పరిచయమయ్యానని, ఇప్పుడు మరోసారి అతడి నిర్మాణంలో నటించడం హ్యాపీగా ఉందంటోంది మెహ్రీన్. హీరోయిన్లంతా హిందీ, తమిళ సినిమాలవైపు చూస్తుంటే… మెహ్రీన్ మాత్రం తను తెలుగు సినిమాల్లో మాత్రమే నటిస్తానంటోంది.

First Published:  28 Sept 2019 6:18 AM IST
Next Story