Telugu Global
NEWS

మగాళ్లు లేనప్పుడు వచ్చి తలుపు కొడుతున్నారు

గ్రామ వాలంటీర్ల వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు చంద్రబాబు కొత్త ఆలోచనతో ముందుకెళ్తున్నాడు. వాలంటీర్లను మానసికంగా దెబ్బతీయడం ద్వారా వ్యవస్థను దెబ్బతీసే పనిలో ఉన్నాడు. తాజాగా వాలంటీర్ల గురించి చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేశాడు. గోనె సంచులు మోసే ఉద్యోగాలు ఇచ్చి పెద్ద ఉద్యోగాలు ఇచ్చినట్టుగా ప్రభుత్వం చెప్పుకుంటోందని వ్యాఖ్యానించాడు. వాలంటీర్ల వల్ల పెద్ద ప్రమాదం ఉందంటూ కొన్ని చేయకూడని వ్యాఖ్యలు చేశాడు. గ్రామ వాలంటీర్లు ఎప్పుడంటే అప్పుడు ఇళ్లకు వెళ్లి డిస్ట్రబ్ చేస్తున్నారని వ్యాఖ్యానించాడు. మగాళ్లు ఇంట్లో […]

మగాళ్లు లేనప్పుడు వచ్చి తలుపు కొడుతున్నారు
X

గ్రామ వాలంటీర్ల వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు చంద్రబాబు కొత్త ఆలోచనతో ముందుకెళ్తున్నాడు. వాలంటీర్లను మానసికంగా దెబ్బతీయడం ద్వారా వ్యవస్థను దెబ్బతీసే పనిలో ఉన్నాడు.

తాజాగా వాలంటీర్ల గురించి చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేశాడు. గోనె సంచులు మోసే ఉద్యోగాలు ఇచ్చి పెద్ద ఉద్యోగాలు ఇచ్చినట్టుగా ప్రభుత్వం చెప్పుకుంటోందని వ్యాఖ్యానించాడు.

వాలంటీర్ల వల్ల పెద్ద ప్రమాదం ఉందంటూ కొన్ని చేయకూడని వ్యాఖ్యలు చేశాడు. గ్రామ వాలంటీర్లు ఎప్పుడంటే అప్పుడు ఇళ్లకు వెళ్లి డిస్ట్రబ్ చేస్తున్నారని వ్యాఖ్యానించాడు. మగాళ్లు ఇంట్లో లేనప్పుడు వచ్చి డోర్లు కొడుతున్నారని విమర్శించాడు. ఇలాంటి పనులు ఎంత నీచం అంటూ వ్యాఖ్యానించాడు. ఒక వాలంటీర్ ఒక అమ్మాయిని కామ వాంచ తీర్చమని అడిగాడని చంద్రబాబు చెప్పాడు.

ఇలాంటి ఆఘాయిత్యాలు ఇంకా ఎన్ని చూడాలో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే గ్రామ వాలంటీర్లను మానసికంగా దెబ్బతీసేందుకు చంద్రబాబు ముందుకెళ్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతోంది. కొద్దిరోజుల క్రితం కూడా గ్రామ వాలంటీర్లకు పెళ్లిళ్లు కూడా కావంటూ చంద్రబాబు శాపనార్థాలు పెట్టాడు.

First Published:  28 Sept 2019 2:03 AM IST
Next Story