ఆయన మాటే జీవో అనుకోవాలంట !
అబ్బే… చూస్తుంటే.. జగన్ ఎంత మంచి పని చేసినా, అద్బుతాలు సృష్టించినా… ఈ రాష్ట్రం మొత్తం అంగీకరిస్తుందేమో గానీ చంద్రబాబు మాత్రం అంగీకరించడానికి సిద్ధంగా లేరనిపిస్తోంది. జగన్ చేస్తున్న పనుల్లో విమర్శించేందుకు కనీసం తోక దొరక్కపోయినా… మీడియా తోక పట్టుకుని బాబు రాజకీయ గోదావరిని ఈదేస్తూ… ఈ వయసులో కావాల్సింది నిజాలు కాదు… మనశ్శాంతిని కలిగించే కథనాలు…. అన్నట్టుగా బాబు బతికేస్తున్నాడు. శ్రీకాకుళం జిల్లాలో బియ్యం ఇంటింటికి డోర్ డెలివరీ లో 99.9 శాతం సక్సెస్‌ను వదిలేసి… […]
అబ్బే… చూస్తుంటే.. జగన్ ఎంత మంచి పని చేసినా, అద్బుతాలు సృష్టించినా… ఈ రాష్ట్రం మొత్తం అంగీకరిస్తుందేమో గానీ చంద్రబాబు మాత్రం అంగీకరించడానికి సిద్ధంగా లేరనిపిస్తోంది. జగన్ చేస్తున్న పనుల్లో విమర్శించేందుకు కనీసం తోక దొరక్కపోయినా… మీడియా తోక పట్టుకుని బాబు రాజకీయ గోదావరిని ఈదేస్తూ… ఈ వయసులో కావాల్సింది నిజాలు కాదు… మనశ్శాంతిని కలిగించే కథనాలు…. అన్నట్టుగా బాబు బతికేస్తున్నాడు.
శ్రీకాకుళం జిల్లాలో బియ్యం ఇంటింటికి డోర్ డెలివరీ లో 99.9 శాతం సక్సెస్‌ను వదిలేసి… చూశారా 0.01 శాతం బియ్యం సంచులు తడిసిపోయాయి…. అంటూ విమర్శలు చేసి తరించాడు.
లక్షా 34వేల పోస్టులను ప్రభుత్వం ఒకేసారి భర్తీ చేయడంతో… ఏమి చేయలో తోచక ఆఖరి వరకు ఆలోచించి, అంతా అయిపోయి రిజల్ట్ వచ్చిన తర్వాత అదిగో పలానా కులం అమ్మాయికి ఉద్యోగం వచ్చింది… కాబట్టి ఇది ముమ్మాటికీ పేపర్ లీకే అంటూ ఒక పత్రిక ద్వారా పుకార్లను జనాల్లోకి వదిలి ఊపిరి పీల్చుకునే ప్రయత్నం చేశాడు.
సచివాలయ ఉద్యోగాల్లో టీడీపీ, జనసేన అభిమానులు కూడా వేలల్లో ఉద్యోగాలు సాధించిన సంగతి మాత్రం చంద్రబాబు అండ్ మీడియా చెప్పదు.
ఇప్పుడు జగన్ విశాఖ బాక్సైట్ తవ్వకాలను రద్దు చేయగా…అది కూడా నేనే చేశా అంటూ బాబు బయలుదేరాడు. తాను అధికారంలో ఉన్నప్పుడే లీజులు రద్దు చేశానని ఇప్పుడు తిరిగి రద్దు చేయడం ఏమిటని… అమాయకంగా పార్టీ నేతల సమావేశంలో బాబు ప్రశ్నించాడు.
బాక్సైట్ తవ్వకాలను రద్దు చేసిన ఘనత చంద్రబాబుదే అని గతంలో మాజీ కేంద్రమంత్రి కిషోర్ చంద్రదేవ్ (ప్రస్తుతం ఈయన టీడీపీలో ఉన్నారు) కూడా చెప్పారని బాబు సమావేశంలో చెప్పారు. అయితే బాక్సైట్ తవ్వకాలను చంద్రబాబు రద్దు చేయలేదు.
అధికారంలోకి రాగానే కేంద్రంపై ఒత్తిడి తెచ్చి 2015 నవంబర్ 5న తవ్వకాలకు తుది అనుమతులు తెచ్చింది బాబే. బాక్సైట్ తవ్వకాలతోనే గిరిజనుల అభివృద్ధి సాధ్యమన్న నినాదాన్ని కూడా అప్పట్లో బాబు ఇచ్చారు. ఆ సమయంలోనే గిరిజనులు పెద్దెత్తున తిరగబడ్డారు.
వైసీపీ నుంచి గెలిచి టీడీపీలోకి ఫిరాయించిన గిడ్డి ఈశ్వరి… బాక్సైట్ జోలికి వస్తే చంద్రబాబు తల నరికేస్తాం అని కూడా హెచ్చరించింది అప్పుడే. ఇలా తీవ్ర వ్యతిరేకత రావడంతో బాబు వెనక్కు తగ్గాడు.
ఎన్నికల సమయంలో బాక్సైట్ లీజులను రద్దు చేస్తామని ప్రచారం చేశాడు. కానీ జీవో ఇవ్వలేదు. తిరిగి బాబు గెలిచి ఉంటే ఈపాటికి బాక్సైట్ తవ్వకాలు మొదలై ఉండేవని చెబుతుంటారు. జీవో ఇవ్వకుండా మాట వరుసకు రద్దు చేస్తానని చెప్పిన బాబు… ఇప్పుడు ప్రభుత్వం ఏకంగా జీవోలు విడుదల చేయడంతో ఎన్నిసార్లు రద్దు చేస్తారండి… అంటూ మండిపోతున్నాడు. అంటే బాబు ఉద్దేశంలో ఆయన మాటే ఒక జీవో అన్న మాట.