లేడీ సింగం మళ్లీ ట్రాన్స్ ఫర్ అయింది !
రోహిణి సింధూరి. కర్నాటక ఐఏఎస్ ఆఫీసర్. తెలుగు బిడ్డ. 2009 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఈమెది ఖమ్మం జిల్లా రుద్రాక్షపల్లి. హైదరాబాద్‌లో చదువుకుంది. కర్నాటకలో ఐఏఎస్ లో పనిచేస్తున్న ఈమె గురించి గూగుల్ లో టైప్ చేస్తే మీకు ఎక్కువగా కనిపించేంది ఆమె బదిలీల వార్తలే. దీన్ని బట్టే ఆమె నిజాయితీ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. హసన్ జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్నప్పుడు ట్రాన్స్‌ఫర్ అయింది. అయితే ఎన్నికల కమిషన్, హైకోర్టు జోక్యంతో ఆగిపోయింది. ఆ తర్వాత ప్రభుత్వాలు […]
రోహిణి సింధూరి. కర్నాటక ఐఏఎస్ ఆఫీసర్. తెలుగు బిడ్డ. 2009 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఈమెది ఖమ్మం జిల్లా రుద్రాక్షపల్లి. హైదరాబాద్‌లో చదువుకుంది.
కర్నాటకలో ఐఏఎస్ లో పనిచేస్తున్న ఈమె గురించి గూగుల్ లో టైప్ చేస్తే మీకు ఎక్కువగా కనిపించేంది ఆమె బదిలీల వార్తలే. దీన్ని బట్టే ఆమె నిజాయితీ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. హసన్ జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్నప్పుడు ట్రాన్స్‌ఫర్ అయింది. అయితే ఎన్నికల కమిషన్, హైకోర్టు జోక్యంతో ఆగిపోయింది.
ఆ తర్వాత ప్రభుత్వాలు మారడంతో ఆమెను కార్మికశాఖకు మార్చారు. అక్కడ ఆమె నిజాయితే ఇప్పుడు మరోసారి బదిలీ చేసింది. లేడీ సింగంగా పేరున్న సింధూరి మరోసారి రాజకీయ ఒత్తిళ్లకు లొంగలేదు. దీంతో ఆమెను ప్రాధాన్యత లేని శాఖకు బదిలీ చేశారు. పదేళ్లలో ఇది నాలుగోసారి ఆమె రాజకీయ ఒత్తిళ్ల వల్ల బదిలీకావడం. ప్రస్తుతం ఆమెను సెరీ కల్చర్ శాఖకు బదిలీ చేశారు.
అసలు ఏం జరిగిందంటే….సింధూరి ప్రస్తుతం కార్మికశాఖలో ఉన్నారు. ఈ శాఖను ముఖ్యమంత్రి యడ్యూరప్ప చూస్తున్నారు. కర్నాటక భవన, ఇతర కార్మికుల సంక్షేమ బోర్డును ఆమె చూస్తున్నారు. ఈ బోర్డు కింద ఉన్న కార్పస్‌ఫండ్‌లో వెయ్యి కోట్లను వరద బాధితుల సహాయ చర్యలకు మళ్లించేందుకు సింధూరి ఒప్పుకోలేదు. దీంతో ముఖ్యమంత్రికి కోపం వచ్చి వెంటనే ఆమెను బదిలీ చేశారు.
కార్మికుల సంక్షేమ నిధి కింద దాదాపు 8 వేల కోట్లు ఉన్నాయి. వీటిలో మూడు వేల కోట్లను ఇప్పటికే ఇతర సహాయ చర్యలకు వాడారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పుడ్ ప్యాకెట్లు, ఫర్నీచర్, సహాయ శిబిరాల్లో లైటింగ్ ఏర్పాట్ల కోసం మరో వెయ్యి కోట్లను మళ్లించాలని చూశారు. అయితే ఈ మళ్లింపును సింధూరి గట్టిగా వ్యతిరేకించారు.
కార్మికుల సంక్షేమ నిధుల ఖర్చును సుప్రీంకోర్టు నిశితంగా పరిశీలిస్తుందని….ఎలా ఖర్చు చేయాలనే దానిపై కఠినమైన, క్లియర్ కట్ మార్గదర్శకాలు ఉన్నాయని…వాటిని ఉల్లంఘించలేనని చెప్పింది.
గత ఎనిమిదేళ్లలో 500 కోట్లు కూడా తన శాఖ ఖర్చు పెట్టలేదని…ఒకేసారి మూడు వేలకోట్లు ఖర్చు పెట్టడం అంటే వృథా చేయడమేనని ఆమె చెప్పింది. ఆమె సమాధానంతో చిర్రెత్తిపోయిన ముఖ్యమంత్రి మీటింగ్‌లోనే ఆమెను బదిలీ చేస్తున్నట్లు ప్రకటించాడట.