Telugu Global
International

ఒంటెను కరిచిన మనిషి....

అమెరికాలో ఓ మహిళ తన కుక్కను ఓ ఒంటె బారి నుంచి తప్పించడానికి ప్రయత్నించే క్రమంలో ఒంటెను కరిచిందట. కుక్క, పిల్లి వంటి పెంపుడు జంతువులు కరిస్తే వెంటనే ప్రాణాంతకమైన రేబీస్ వ్యాధి వస్తుందని భయపడి యాంటిబయోటిక్స్ తీసుకుంటాం… మరి మనిషే ఆ జంతువులను కరిస్తే వాటికి ఏమవుతుంది? అమెరికా లూసియానాలోని టైగర్ ట్రక్ షాప్ దగ్గర ఉన్న ఒక ఒంటె షెడ్ లోకి గ్లోరియా లాంకాస్టర్ (68), ఎడ్మండ్ లాంకాస్టర్ (73) అనే దంపతులు తమ […]

ఒంటెను కరిచిన మనిషి....
X

అమెరికాలో ఓ మహిళ తన కుక్కను ఓ ఒంటె బారి నుంచి తప్పించడానికి ప్రయత్నించే క్రమంలో ఒంటెను కరిచిందట.

కుక్క, పిల్లి వంటి పెంపుడు జంతువులు కరిస్తే వెంటనే ప్రాణాంతకమైన రేబీస్ వ్యాధి వస్తుందని భయపడి యాంటిబయోటిక్స్ తీసుకుంటాం… మరి మనిషే ఆ జంతువులను కరిస్తే వాటికి ఏమవుతుంది?

అమెరికా లూసియానాలోని టైగర్ ట్రక్ షాప్ దగ్గర ఉన్న ఒక ఒంటె షెడ్ లోకి గ్లోరియా లాంకాస్టర్ (68), ఎడ్మండ్ లాంకాస్టర్ (73) అనే దంపతులు తమ చెవిటి కుక్కను వదిలి… దానిపైకి ఆహారం విసురుతున్నారట.

ఈ తతంగం ఏమాత్రం నచ్చని ఒంటె వచ్చి ఆ కుక్కమీద కూర్చున్నది. దీంతో కుక్క కుయ్యో మొర్రో అంటూ అరుస్తూ ఉండటంతో…. లాంకాస్టర్ దంపతులు ఓంటె దగ్గరికి వెళ్లి దానిని పక్కకు నెడుతూ భయపెట్టారట. దీంతో ఒంటె ఈసారి గ్లోరియా పై కూర్చున్నదట.

దిమ్మెరపోయిన గ్లోరియా 272 కేజీల బరువున్న ఆ ఒంటె కింద ఊపిరాడని స్థితిలో… అందుబాటులో ఉన్న ఒంటె ప్రైవేట్ పార్ట్ ని గట్టిగా కొరికిందట. ఈ చర్యతో ఒంటె ఆమే మీదనుంచి లేచిందట.

తామేమీ చెయ్యకపోయినా ఒంటె తమ కుక్కపై దాడి చేసిందని…. ఈ జంట పోలీసులకు తెలిపింది. ఒంటె ఇంటిలోకి కుక్కను పంపి తామేమీ దాన్ని రెచ్చగొట్టలేదని అనడం సరి కాదని పోలీసులు ఆమెను మందలించారట.

ఇక మనిషి కాటుకు గురైన ఒంటెను పరీక్షించిన పశువుల డాక్టర్… ఎందుకైనా మంచిదని రేబీస్ రాకుండా యాంటిబయోటిక్స్ ఇచ్చాడట.

First Published:  26 Sept 2019 2:12 PM IST
Next Story