Telugu Global
NEWS

ఉప ఎన్నిక బరిలో 251 మంది సర్పంచ్ లు

తెలంగాణలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితికి ఝలక్ ఇవ్వనున్నారు సర్పంచ్ లు. ఎలా అంటారా.. ప్రజాస్వామ్య బద్దంగా… అదీ ఎన్నికల ద్వారానే. నిజామాబాద్ లోక్ సభ ఎన్నికల్లో వందలాది మంది పసుపు రైతులు నామినేషన్లు వేసి అధికార తెలంగాణ రాష్ట్ర్ర సమితికి భారీ ఓటమి మిగిల్చారు. ఈ ఎన్నికల్లో ఏకంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కుమార్తె కవిత భారీ తేడాతో ఓటమి పాలయ్యారు. ఆమె ఓటమికి కారణం పసుపు రైతులేనని అధికార పార్టీ సైతం అంగీకరించింది. ఇదిగో […]

ఉప ఎన్నిక బరిలో 251 మంది సర్పంచ్ లు
X

తెలంగాణలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితికి ఝలక్ ఇవ్వనున్నారు సర్పంచ్ లు. ఎలా అంటారా.. ప్రజాస్వామ్య బద్దంగా… అదీ ఎన్నికల ద్వారానే.

నిజామాబాద్ లోక్ సభ ఎన్నికల్లో వందలాది మంది పసుపు రైతులు నామినేషన్లు వేసి అధికార తెలంగాణ రాష్ట్ర్ర సమితికి భారీ ఓటమి మిగిల్చారు. ఈ ఎన్నికల్లో ఏకంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కుమార్తె కవిత భారీ తేడాతో ఓటమి పాలయ్యారు. ఆమె ఓటమికి కారణం పసుపు రైతులేనని అధికార పార్టీ సైతం అంగీకరించింది.

ఇదిగో ఇప్పుడు అదే ఎన్నికల అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు తెలంగాణలోని సర్పంచ్ లు. తెలంగాణ సర్కార్ సర్పంచ్ ల పట్ల అవలంభిస్తున్న వైఖరికి వ్యతిరేకంగా హుజూర్ నగర్ లో జరిగే ఉప ఎన్నికలో పోటీ చేయాలని నిర్ణయించారు. “హలో సర్పంచ్… చలో హుజూర్ నగర్” నినాదంతో ఈ నెల 29, 30 తేదీలలో నామినేషన్లు వేయాలని నిర్ణయించారు.

“సర్పంచ్ ల పట్ల ప్రభుత్వ వైఖరికి నిరసనగా మేమంతా నామినేషన్లు వేయాలని నిర్ణయించాం” అని సర్పంచ్ ల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు సౌదామి భూమన్న యాదవ్ తెలిపారు. హుజూర్ నగర్ లో ఎన్నికలు అటు ప్రభుత్వానికి, ఇటు ప్రతిపక్షాలకు కూడా ప్రతిష్టాత్మకంగా మారాయి.

ఇక్కడ ఎలాగైనా విజయం సాధించి ప్రభుత్వం పట్ల ప్రజలకు నమ్మకముందని నిరూపించాలని తెలంగాణ రాష్ట్ర సమితి భావిస్తోంది. ఇక్కడి నుంచి మరోసారి విజయం సాధించి హుజూర్ నగర్ లో తన ప్రభావం ఎంత ఉంటుందో నిరూపించుకోవాలని కాంగ్రెస్ పార్టీ… ముఖ్యంగా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పట్టుదలగా ఉన్నారు.

ఇక తెలంగాణాలో తాము పాగా వేశామని చెప్పేందుకు భారతీయ జనతా పార్టీ గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఈ ముక్కోణపు పోరులో కొత్తగా సర్పంచ్ లు కూడా చేరడంతో హుజూర్ నగర్ ఉప ఎన్నిక రసకందాయంలో పడింది. ఇక్కడి నుంచి 251 మంది సర్పంచ్ లు పోటీ చేస్తే దాని ప్రభావం అధికార తెలంగాణ రాష్ట్ర సమితిపై ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

First Published:  26 Sept 2019 6:11 AM IST
Next Story