ప్రజాభిమానంలో మోడీ తర్వాత ధోనీనే
ధోనీతో పోటీలోనే లేని కొహ్లీ, సచిన్ ప్రపంచ వ్యాప్తంగా అత్యంత జనాదరణ, ప్రజాభిమానం ఉన్న భారతీయులలో ప్రధాని నరేంద్ర మోడీ, భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మొదటి రెండు స్థానాలలో నిలిచారు. భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ, మాస్టర్ సచిన్ టెండుల్కర్…ధోనీకి సమఉజ్జీలు కాలేకపోయారు. యూగోవ్ అనే సంస్థ ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించిన సర్వే ప్రకారం 15.66 శాతం ఓట్లతో నరేంద్ర మోడీ అగ్రస్థానంలో నిలిచారు. మహేంద్ర సింగ్ ధోనీని అభిమానించేవారు 8.58 శాతం ఉన్నారు. మూడో […]
- ధోనీతో పోటీలోనే లేని కొహ్లీ, సచిన్
ప్రపంచ వ్యాప్తంగా అత్యంత జనాదరణ, ప్రజాభిమానం ఉన్న భారతీయులలో ప్రధాని నరేంద్ర మోడీ, భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మొదటి రెండు స్థానాలలో నిలిచారు. భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ, మాస్టర్ సచిన్ టెండుల్కర్…ధోనీకి సమఉజ్జీలు కాలేకపోయారు.
యూగోవ్ అనే సంస్థ ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించిన సర్వే ప్రకారం 15.66 శాతం ఓట్లతో నరేంద్ర మోడీ అగ్రస్థానంలో నిలిచారు. మహేంద్ర సింగ్ ధోనీని అభిమానించేవారు 8.58 శాతం ఉన్నారు.
మూడో స్థానంలో రతన్ టాటా, నాలుగు, ఐదు స్థానాలలో బరాక్ ఒబామా, బిల్ గేట్స్ ఉన్నారు. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఆరు, సచిన్ టెండుల్కర్ ఏడు, విరాట్ కొహ్లీ ఎనిమిది, షారుక్ ఖాన్ తొమ్మిది స్థానాలలో నిలిచారు.
మహిళల్లో మేరీ కోమ్ టాప్…
అత్యంత ప్రజాభిమానం ఉన్న మహిళల్లో బాక్సింగ్ క్వీన్ మేరీ కోమ్ అగ్రస్థానంలో నిలిచింది.కిరణ్ బేడీ రెండు, లతా మంగేష్కర్ మూడు, సుశ్మా స్వరాజ్ నాలుగు, దీపిక పడుకోన్ ఐదు స్థానాలలో ఉన్నారు.
ప్రియాంకా చోప్రా, ఐశ్వర్యారాయ్ 8, 9 స్థానాలకు మాత్రమే పరిమితమయ్యారు.