Telugu Global
NEWS

అక్టోబర్‌ 10 నుంచి వైఎస్‌ఆర్‌ కంటి వెలుగు

ఏపీ ప్రభుత్వం మరో పథకానికి శ్రీకారం చుడుతోంది. అక్టోబర్ 10 నుంచి వైఎస్‌ఆర్ కంటి వెలుగు పథకాన్ని ప్రారంభిస్తున్నారు. ఐదు దశల్లో ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. పథకం పర్యవేక్షణకు జిల్లా టాస్క్‌ఫోర్స్‌ కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీలకు చైర్మన్ లుగా జిల్లా కలెక్టర్లు వ్యవహరిస్తారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకం కింద ఏపీలోని ప్రజలందరికీ ఉచితంగా కంటి పరీక్షలు, అవసరమైన చికిత్స చేస్తారు. అక్టోబర్ 10 నుంచి వారం పాటు కంటి పరీక్షలు నిర్వహిస్తారు. […]

అక్టోబర్‌ 10 నుంచి వైఎస్‌ఆర్‌ కంటి వెలుగు
X

ఏపీ ప్రభుత్వం మరో పథకానికి శ్రీకారం చుడుతోంది. అక్టోబర్ 10 నుంచి వైఎస్‌ఆర్ కంటి వెలుగు పథకాన్ని ప్రారంభిస్తున్నారు. ఐదు దశల్లో ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. పథకం పర్యవేక్షణకు జిల్లా టాస్క్‌ఫోర్స్‌ కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీలకు చైర్మన్ లుగా జిల్లా కలెక్టర్లు వ్యవహరిస్తారు.

ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకం కింద ఏపీలోని ప్రజలందరికీ ఉచితంగా కంటి పరీక్షలు, అవసరమైన చికిత్స చేస్తారు.

అక్టోబర్ 10 నుంచి వారం పాటు కంటి పరీక్షలు నిర్వహిస్తారు. ఆ తర్వాత ఐదు దశల్లో కంటి చూపు లోపం ఉన్న వారికి ఆపరేషన్లు చేయడం, కళ్ళజోళ్ళు ఉచితంగా అందజేయడం చేస్తారు.

ఈ పథకం తొలుత తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చింది. అక్కడ విజయవంతం కావడంతో పాటు ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చింది.

First Published:  25 Sept 2019 11:40 AM IST
Next Story