వెంటిలేటర్‌పై వేణుమాధవ్
హాస్యనటుడు వేణుమాధవ్ ఆరోగ్య పరిస్థితి విషమించింది. ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. కొద్దికాలంగా వేణుమాధవ్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. కొద్దికాలంగా కాలేయ వ్యాధిలో బాధపడుతున్న వేణుమాధవ్ కు.. కిడ్నీ కూడా పాడవడంతో సికింద్రాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. వేణుమాధవ్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. వెంటిలేటర్‌పై ఉన్న వేణుమాధవ్‌ను జీవిత, రాజశేఖర్‌తో పాటు పలువురు సినిమావారు పరామర్శించారు. కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. మిమిక్రీ ఆర్టిస్ట్‌గా కేరీర్ ప్రారంభించిన వేణుమాధవ్ ఆ తర్వాత ప్రముఖ కమెడియన్‌గా […]
హాస్యనటుడు వేణుమాధవ్ ఆరోగ్య పరిస్థితి విషమించింది. ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. కొద్దికాలంగా వేణుమాధవ్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. కొద్దికాలంగా కాలేయ వ్యాధిలో బాధపడుతున్న వేణుమాధవ్ కు.. కిడ్నీ కూడా పాడవడంతో సికింద్రాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు.
వేణుమాధవ్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. వెంటిలేటర్‌పై ఉన్న వేణుమాధవ్‌ను జీవిత, రాజశేఖర్‌తో పాటు పలువురు సినిమావారు పరామర్శించారు. కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. మిమిక్రీ ఆర్టిస్ట్‌గా కేరీర్ ప్రారంభించిన వేణుమాధవ్ ఆ తర్వాత ప్రముఖ కమెడియన్‌గా ఎదిగారు. టీడీపీకి వీరాభిమాని. నంద్యాల ఉప ఎన్నికల సమయంలో టీడీపీ తరపున ప్రచారం చేశారు.
వేణుమాధవ్ ఆరోగ్యంపై గతంలోనే పలుమార్లు వార్తలొచ్చాయి. కొన్ని చానళ్లు వేణుమాధవ్ చనిపోయాడంటూ గతంలో కథనాలు కూడా ప్రసారం చేశాయి. వాటిని పలుమార్లు వేణుమాధవ్ ఖండించాడు.
కొన్నేళ్లుగా చిత్రపరిశ్రమలోనూ వేణుమాధవ్‌కు అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రయత్నించాడు. ఏ పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో ఇండిపెండెంట్‌గా కోదాడ అభ్యర్థిగా నామినేషన్ వేశాడు. కానీ దాన్ని ఎన్నికల అధికారులు తిరస్కరించారు.