టార్గెట్ శరద్ పవార్
చిదంబరం, శివకుమార్… ఇప్పుడు శరద్‌పవార్. ప్రత్యర్థి పార్టీలకు చెందిన బలమైన నాయకులు, ప్రాంతీయ పార్టీల నేతలను బీజేపీ ప్రభుత్వం గట్టిగానే టార్గెట్ చేస్తున్నట్టుగా ఉంది. ఈ నేతలు నిజాయితీపరులు అని సర్టిఫై చేయలేం గానీ… అదే సమయంలో అదును చూసి ప్రత్యర్థులను బలహీనపరిచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా మహారాష్ట్రలో బలమైన నేతగా ఉన్నశరద్ పవార్‌పై ఈడీ కేసులు నమోదు చేసింది. శరద్ పవార్‌తో పాటు ఆయన అన్న కొడుకు అజిత్ పవార్‌పైనా ఈడీ […]
చిదంబరం, శివకుమార్… ఇప్పుడు శరద్‌పవార్. ప్రత్యర్థి పార్టీలకు చెందిన బలమైన నాయకులు, ప్రాంతీయ పార్టీల నేతలను బీజేపీ ప్రభుత్వం గట్టిగానే టార్గెట్ చేస్తున్నట్టుగా ఉంది.
ఈ నేతలు నిజాయితీపరులు అని సర్టిఫై చేయలేం గానీ… అదే సమయంలో అదును చూసి ప్రత్యర్థులను బలహీనపరిచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా మహారాష్ట్రలో బలమైన నేతగా ఉన్నశరద్ పవార్‌పై ఈడీ కేసులు నమోదు చేసింది.
శరద్ పవార్‌తో పాటు ఆయన అన్న కొడుకు అజిత్ పవార్‌పైనా ఈడీ కేసులు నమోదు చేసింది. మహారాష్ట్ర రాష్ట్ర కో ఆపరేటివ్ బ్యాంక్ (ఎంఎస్‌సీబీ)లో రూ.25 వేల కోట్ల కుంభకోణానికి సంబంధించి వీరిపై మనీల్యాండరింగ్ కేసు బుక్ చేశారు. మహారాష్ట్ర్ర అసెంబ్లీ ఎన్నికల పక్రియకు షెడ్యూల్ విడుదలైన వెంటనే పవార్‌పై కేసులు నమోదు కావడం చర్చనీయాంశమైంది.
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్- ఎన్‌సీపీ కలిసి పోటీ చేస్తామని ప్రకటించిన నేపథ్యంలోనే ఈ కేసులను బయటకు తీశారని ఎన్‌సీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
రైతులకు రుణాల మంజూరులో ఎంఎస్‌సీబీలో ఆడిట్ చేపట్టిన నాబార్డు రైతులకు రుణాల మంజూరులో భారీగా అవకతవకలు జరిగినట్లు ఇది వరకే గుర్తించారు. నిర్దిష్టమైన ఆధారాలున్నందున దీనిపై కేసు నమోదు చేయాలంటూ బాంబే హైకోర్టు ఆగస్టులో ఆర్థిక నేరాల విభాగాన్ని ఆదేశించింది.
ముంబై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కుంభకోణంలో నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వీటి ఆధారంగా ఈడీ అప్పటి సీఎం శరద్‌పవార్ సహా 2007–17 సంవత్సరాల మధ్య పనిచేసిన ఎంఎస్‌సీబీ డైరెక్టర్లు, మాజీ డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌తో పాటు 70 మంది మాజీ అధికారులపై కేసులు పెట్టింది.