Telugu Global
NEWS

బాబు కోసం లింగమనేని యూ టర్న్‌

కృష్ణా నది కరకట్టకు లోపల అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చివేసేందుకు ప్రభుత్వం సిద్ధమవడంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. తమ అక్రమ కట్టడాలను కూలిస్తే రాష్ట్ర అభివృద్ధి ఆగిపోతుంది అంటూ వీళ్లే రాష్ట్ర్ర అభివృద్ధి పితామహులు అన్నట్టుగా బిల్డప్ ఇస్తున్నారు. చంద్రబాబు నివాసం ఉంటున్న కరకట్ట భవనానికి కూడా కూల్చివేత నోటీసులను సీఆర్‌డీఏ ఇచ్చిన నేపథ్యంలో అటు టీడీపీ, ఇటు లింగమనేని రమేష్ ఇద్దరూ గగ్గోలు పెడుతున్నారు. లింగమనేని రమేష్ ఏకంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి […]

బాబు కోసం లింగమనేని యూ టర్న్‌
X

కృష్ణా నది కరకట్టకు లోపల అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చివేసేందుకు ప్రభుత్వం సిద్ధమవడంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. తమ అక్రమ కట్టడాలను కూలిస్తే రాష్ట్ర అభివృద్ధి ఆగిపోతుంది అంటూ వీళ్లే రాష్ట్ర్ర అభివృద్ధి పితామహులు అన్నట్టుగా బిల్డప్ ఇస్తున్నారు. చంద్రబాబు నివాసం ఉంటున్న కరకట్ట భవనానికి కూడా కూల్చివేత నోటీసులను సీఆర్‌డీఏ ఇచ్చిన నేపథ్యంలో అటు టీడీపీ, ఇటు లింగమనేని రమేష్ ఇద్దరూ గగ్గోలు పెడుతున్నారు.

లింగమనేని రమేష్ ఏకంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాశారు. తమ లాంటి వారు అభివృద్ధికి తోడ్పడుతుంటే ఇలాంటి ఒత్తిళ్లు న్యాయమా అని ప్రశ్నించారు. ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా నాటి ముఖ్యమంత్రికి నివాసం కల్పించాలని భావించి తన నివాసం ఇచ్చానని లేఖలో చెప్పారు.

”సీఆర్‌డీఏ అధికారులు మా(బాబు ఉంటున్న ఇల్లు) ఇంటిని కూల్చివేస్తారని తెలియగానే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల వారు ఆందోళనకు గురవుతున్నారని లేఖలో లింగమనేని వివరించాడు. అయితే లింగమనేని లేఖలో చెప్పిన అంశాలు గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఏకంగా ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి చెవిలోనే లింగమనేని పూలు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా ఈ లేఖలో అంశాలను బట్టి తెలుస్తో్ంది.

ఇదే లింగమనేని రమేష్ గతంలో ఈ అక్రమ కట్టడంపై వివాదం చెలరేగినప్పుడు ఆ కట్టడంతో తనకు ఎలాంటి సంబంధం లేదని టీవీ కెమెరాల సాక్షిగా చెప్పారు. చంద్రబాబు నివాసం ఉంటున్న గెస్ట్‌ హౌస్‌ను నిర్మించింది తానే అయినా… దాన్ని ల్యాండ్ పూలింగ్‌లో భాగంగా ప్రభుత్వానికి ఇచ్చేశానని… కాబట్టి దాంతో తనకు ఎలాంటి సంబంధం లేదని గతంలో లింగమనేని చెప్పాడు.

దాన్ని ఉంచుతారా లేక కూల్చుతారా అన్నది ప్రభుత్వం ఇష్టమని కెమెరాల ముందు లింగమనేని చెప్పాడు. చంద్రబాబు కూడా అసెంబ్లీ వేదికగా లింగమనేని గెస్ట్‌ హౌస్‌ ల్యాండ్‌ పూలింగ్‌లో భాగంగా ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని… అందుకే తాను ముఖ్యమంత్రి హోదాలో అక్కడ నివాసం ఉంటున్నట్టు చెప్పాడు.

గతంలో ల్యాండ్ పూలింగ్‌లో ప్రభుత్వానికి తన గెస్ట్ హౌస్ ఇచ్చేశానని చెప్పిన లింగమనేని రమేష్… ఇప్పుడు మాత్రం అది తనదే అంటూ లేఖ రాయడం ఆశ్చర్యంగా ఉంది. ఇది కళ్లముందు కనిపిస్తున్న యూటర్న్‌గానే భావించాలి. తాను గతంలో కెమెరాల సాక్షిగా గెస్ట్‌ హౌస్‌ను ప్రభుత్వానికి ఇచ్చినట్టు వెల్లడించానన్న విషయం లింగమనేనికి గుర్తు ఉండే ఉంటుంది. అయినా సరే ఇప్పుడు ఇలా సీఎంకు లేఖ రాశాడంటే ప్రభుత్వాన్ని ఎంత తక్కువగా లింగమనేని అంచనా వేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.

గతంలో గెస్ట్‌ హౌస్‌ను ల్యాండ్ పూలింగ్‌లో భాగంగా ప్రభుత్వానికి ఇచ్చేశాను… దాన్ని ఉంచాలా కూల్చాలా అన్నది ఇక ప్రభుత్వ ఇష్టమని గతంలో కెమెరాల సాక్షిగా చెప్పి… ఇప్పుడు మాత్రం అది తనదే అని లింగమనేని చెబుతున్నారంటే ఈయన వ్యక్తిత్వాన్ని కూడా అంచనా వేయవచ్చు.

First Published:  25 Sept 2019 8:50 AM IST
Next Story