Telugu Global
NEWS

సఫారీలతో టెస్ట్ సిరీస్ కు ముందే భారత్ కు దెబ్బ

వెన్నెముక గాయంతో బుమ్రా అవుట్  బుమ్రా స్థానంలో ఉమేశ్ యాదవ్ కు చోటు ఐసీసీ టెస్ట్ చాంపియన్షిప్ లీగ్ లో భాగంగా సౌతాఫ్రికాతో అక్టోబర్ 2 నుంచి ప్రారంభమయ్యే తీన్మార్ సిరీస్ కు ముందే టాప్ ర్యాంకర్ భారత్ కు గట్టి దెబ్బ తగిలింది. భారత తురుపుముక్క, యార్కర్ల కింగ్ జస్ ప్రీత్ బుమ్రా వెన్నెముక గాయంతో సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ సీనియర్ సెలెక్షన్ కమిటీ ప్రకటించింది. బుమ్రాకు ఫిట్ నెస్ పరీక్షలు నిర్వహించిన […]

సఫారీలతో టెస్ట్ సిరీస్ కు ముందే భారత్ కు దెబ్బ
X
  • వెన్నెముక గాయంతో బుమ్రా అవుట్
  • బుమ్రా స్థానంలో ఉమేశ్ యాదవ్ కు చోటు

ఐసీసీ టెస్ట్ చాంపియన్షిప్ లీగ్ లో భాగంగా సౌతాఫ్రికాతో అక్టోబర్ 2 నుంచి ప్రారంభమయ్యే తీన్మార్ సిరీస్ కు ముందే టాప్ ర్యాంకర్ భారత్ కు గట్టి దెబ్బ తగిలింది.

భారత తురుపుముక్క, యార్కర్ల కింగ్ జస్ ప్రీత్ బుమ్రా వెన్నెముక గాయంతో సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ సీనియర్ సెలెక్షన్ కమిటీ ప్రకటించింది.

బుమ్రాకు ఫిట్ నెస్ పరీక్షలు నిర్వహించిన సమయంలో వెన్నెముక దిగువ భాగంలో గాయం బయపడింది. దీంతో సిరీస్ లోని మొత్తం మూడుటెస్టులకు బుమ్రా అందుబాటులో ఉండబోడని టీమ్ డాక్టర్లు ప్రకటించారు.

12 టెస్టులకే బుమ్రా కు గాయం…

మరోవైపు… బుమ్రా అందుబాటులో లేకపోడంతో విదర్భ ఫాస్ట్ బౌలర్ ఉమేశ్ యాదవ్ కు తుదిజట్టులో చోటు కల్పించినట్లు ఎంపిక సంఘం తెలిపింది.

తన కెరియర్ లో ఇప్పటి వరకూ 12 టెస్టులు మాత్రమే ఆడిన 25 ఏళ్ల బుమ్రా మొత్తం 62 వికెట్లు పడగొట్టాడు. అంతేకాదు… విండీస్ తో ముగిసిన రెండుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో హ్యాట్రిక్ తో సహా మొత్తం 13 వికెట్లు పడగొట్టిన ఘనత బుమ్రాకు ఉంది.

టెస్ట్ క్రికెట్ దిగ్గజాలు ఆస్ట్ర్రేలియా, ఇంగ్లండ్, వెస్టిండీస్, సౌతాఫ్రికాజట్ల పై 5 వికెట్ల చొప్పున సాధించిన ఆసియా బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా మాత్రమే కావడం విశేషం.

ఏడాది తర్వాత ఉమేశ్ కు పిలుపు…

2018 డిసెంబర్ లో ఆస్ట్ర్రేలియాపైన తన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడిన ఉమేశ్ యాదవ్ ఆ తర్వాత నుంచి అవకాశాలు లేక టెస్ట్ క్రికెట్ కు దూరమయ్యాడు. తన కెరియర్ లో ఇప్పటి వరకూ ఆడిన 41 టెస్టుల్లో 119 వికెట్లతో 33.47 సగటు సాధించాడు.

సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ ద్వారా ఉమేశ్ యాదవ్ తిరిగి టెస్ట్ మ్యాచ్ ఆడనున్నాడు. సిరీస్ లోని తొలిటెస్ట్ మ్యాచ్ అక్టోబర్ 2 నుంచి విశాఖలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియం వేదికగా ప్రారంభంకానుంది.

First Published:  25 Sept 2019 8:55 AM IST
Next Story