Telugu Global
National

బిగ్ బీ అమితాబ్ కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్

భారత చలన చిత్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు బిగ్ బీ అమితాబచ్చన్ ను వరించింది. భారత చలన చిత్రరంగంలో విశేషమైన సేవలందించిన వారికి ఇచ్చే ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు అమితాబ్ బచ్చన్ ను ఎంపిక చేసినట్లు కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. తన నటనతో రెండు తరాల వారిని అలరించిన అమితాబ్ బచ్చన్ కు దాదా సాహెబ్ పురస్కారాన్ని ఇవ్వాలని అందరూ ఏకగ్రీవంగా ఎంపిక చేశారని ప్రకాష్ […]

బిగ్ బీ అమితాబ్ కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్
X

భారత చలన చిత్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు బిగ్ బీ అమితాబచ్చన్ ను వరించింది. భారత చలన చిత్రరంగంలో విశేషమైన సేవలందించిన వారికి ఇచ్చే ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు అమితాబ్ బచ్చన్ ను ఎంపిక చేసినట్లు కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.

తన నటనతో రెండు తరాల వారిని అలరించిన అమితాబ్ బచ్చన్ కు దాదా సాహెబ్ పురస్కారాన్ని ఇవ్వాలని అందరూ ఏకగ్రీవంగా ఎంపిక చేశారని ప్రకాష్ జవదేకర్ తన ట్విట్టర్ లో పేర్కొన్నారు.

“అమితాబ్ బచ్చన్ ను దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుతో సత్కరించడం పట్ల దేశం మొత్తమే కాదు యావత్ ప్రపంచం తన ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది” అని ప్రకాష్ జవదేకర్ అన్నారు.

ఈ అత్యున్నత పురస్కారానికి ఎంపికైనందుకు వ్యక్తిగతంగా తాను అమితాబ్ బచ్చన్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నానని కూడా ట్విట్టర్ లో జవదేకర్ పేర్కొన్నారు.

భారత చలన చిత్ర రంగంలో దాదాపు నాలుగు దశాబ్దాలుగా తనకంటూ ఓ ప్రత్యేక స్ధానాన్ని సంపాదించుకున్నారు అమితాబ్ బచ్చన్. అక్టోబర్ 11వ తేదీ 1942లో పుట్టిన అమితాబ్ బచ్చన్ షోలే, జంజీర్, సిల్ సిలా, ముకద్దర్ కా సికిందర్, డాన్, అభిమాన్, కూలీ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు అమితాబ్ బచ్చన్.

అంతే కాదు బ్లాక్, పా, పింక్ వంటి చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలను పోషించి సినీ అభిమానులను అలరించారు. కౌన్ బనే గా కరోడ్ పతి టెలివిజన్ షో తో యావత్ దేశ ప్రజలకు తన చరిష్మాను చూపించారు అమితాబ్ బచ్చన్.

ఆయన భార్య జయా బచ్చన్, కుమారుడు అభిషేక్ బచ్చన్, కోడలు ఐశ్వర్య బచ్చన్ కూడా భారత చలనచిత్ర రంగంలో తమ కంటూ ఓ స్దానాన్ని సంపాదించుకోవడం విశేషం.

అమితాబ్ బచ్చన్ తాజాగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఆయన తనయుడు రాంచరణ్ నిర్మిస్తున్న సైరా చిత్రంలో ఓ కీలకమైన పాత్రను పోషిస్తున్నారు. అమితాబ్ బచ్చన్ కు ప్రతిష్టాత్మకమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ఎంపిక కావడం పట్ల రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి, కే.చంద్రశేఖర రావు, పలువురు కేంద్ర మంత్రులు, రాజకీయ ప్రముఖులు తమ శుభాకాంక్షలు తెలిపారు.

మెగాస్టార్ చిరంజీవితో పాటు రజనీకాంత్, దక్షిణ భారత చలనచిత్ర రంగానికి చెందిన పలువురు అమితాబ్ బచ్చన్ కు శుభాకాంక్షలు తెలిపారు.

First Published:  25 Sept 2019 2:38 AM IST
Next Story