Telugu Global
NEWS

3 లిక్కర్‌... 6 బీర్లు... మించకూడదు.... మద్యంపై ఏపీ ప్రభుత్వ ఆంక్షలు

మద్యపాన నివారణకు ఏపీ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే మద్యం షాపులను నేరుగా ప్రభుత్వమే నడిపేందుకు సిద్ధమైంది. బెల్ట్‌ షాపులను పూర్తిగా ఎత్తివేశారు. మద్యం వాడకాన్ని తగ్గించేలా మరికొన్ని చర్యల్లో భాగంగా మద్యం కొనుగోలుపైనా ఆంక్షలు విధించింది. వ్యక్తుల వద్ద మద్యంపై పరిమితి విధించింది. ఏ వ్యక్తి వద్ద అయినా సరే సరైన అనుమతి లేకుండా మూడు సీసాలకు మించి స్వదేశీ, విదేశీ మద్యం ఉండడానికి వీల్లేదు. గతంలో రెట్టింపుగా ఉన్న ఈ పరిమితిని సగానికి […]

3 లిక్కర్‌... 6 బీర్లు... మించకూడదు.... మద్యంపై ఏపీ ప్రభుత్వ ఆంక్షలు
X

మద్యపాన నివారణకు ఏపీ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే మద్యం షాపులను నేరుగా ప్రభుత్వమే నడిపేందుకు సిద్ధమైంది. బెల్ట్‌ షాపులను పూర్తిగా ఎత్తివేశారు. మద్యం వాడకాన్ని తగ్గించేలా మరికొన్ని చర్యల్లో భాగంగా మద్యం కొనుగోలుపైనా ఆంక్షలు విధించింది.

వ్యక్తుల వద్ద మద్యంపై పరిమితి విధించింది. ఏ వ్యక్తి వద్ద అయినా సరే సరైన అనుమతి లేకుండా మూడు సీసాలకు మించి స్వదేశీ, విదేశీ మద్యం ఉండడానికి వీల్లేదు. గతంలో రెట్టింపుగా ఉన్న ఈ పరిమితిని సగానికి తగ్గిస్తూ ఏపీ ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

మద్యం సీసాలు మూడు మాత్రమే ఉంచుకోవాలి. 650 మిల్లీమీటర్ల పరిమాణం ఉన్న ఆరు బీరు సీసాలను ఉంచుకోవచ్చు. అలాగే మెథైలిటేడ్‌ స్పిరిట్‌ మూడు బల్క్‌ లీటర్లు మించి ఉంచుకోవడానికి వీల్లేదు. బుధవారం నుంచే ఈ నిబంధనలు అమలులోకి వస్తాయి.

First Published:  25 Sept 2019 9:00 AM IST
Next Story