Telugu Global
NEWS

సిల్వర్ కింగ్ అమిత్ పంగల్ కు 14 లక్షల నజరానా

ప్రపంచ బాక్సింగ్ లో రజతం నెగ్గిన భారత తొలిబాక్సర్ అమిత్ 2019 ప్రపంచ బాక్సింగ్ పోటీలలో భారత యువబాక్సర్ అమిత్ పంగల్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. రష్యాలోని ఎక్ తెరీనాబర్గ్ వేదికగా ముగిసిన ప్రపంచ బాక్సింగ్ 52 కిలోల విభాగం ఫైనల్లో ఒలింపిక్ చాంపియన్, ఉజ్బెక్ స్టార్ బాక్సర్ షకోబిడిన్ జోయిరోవ్ తో అమిత్ పోరాడి ఓడి రజతపతకంతో సరిపెట్టుకొ్న్నాడు. ప్రపంచ బాక్సింగ్ లో రజతం నెగ్గిన భారత తొలి బాక్సర్ గా పంగల్ రికార్డుల్లో చేరాడు. తొలిబాక్సర్ […]

సిల్వర్ కింగ్ అమిత్ పంగల్ కు 14 లక్షల నజరానా
X
  • ప్రపంచ బాక్సింగ్ లో రజతం నెగ్గిన భారత తొలిబాక్సర్ అమిత్

2019 ప్రపంచ బాక్సింగ్ పోటీలలో భారత యువబాక్సర్ అమిత్ పంగల్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. రష్యాలోని ఎక్ తెరీనాబర్గ్ వేదికగా ముగిసిన ప్రపంచ బాక్సింగ్ 52 కిలోల విభాగం ఫైనల్లో ఒలింపిక్ చాంపియన్, ఉజ్బెక్ స్టార్ బాక్సర్ షకోబిడిన్ జోయిరోవ్ తో అమిత్ పోరాడి ఓడి రజతపతకంతో సరిపెట్టుకొ్న్నాడు.

ప్రపంచ బాక్సింగ్ లో రజతం నెగ్గిన భారత తొలి బాక్సర్ గా పంగల్ రికార్డుల్లో చేరాడు.

తొలిబాక్సర్ అమిత్ పంగల్…

ప్రపంచ బాక్సింగ్ చరిత్రలో ఫైనల్స్ చేరిన భారత తొలి బాక్సర్ గా రికార్డు నెలకొల్పిన అమిత్ పంగల్…రజత పతకం సాధించిన మొనగాడిగా నిలిచాడు.

ఫైనల్లో తనకంటే ఎన్నో రెట్లు బలమైన ప్రత్యర్థిని ఢీ కొన్న అమిత్ పంగల్ కు ఆసియా క్రీడలు, ఆసియా బాక్సింగ్ పోటీలలో బంగారు పతకాలు సాధించిన ఘనత ఉంది. అంతేకాదు ప్రపంచ బాక్సింగ్ లో సైతం రజత పతకం సాధించిన భారత తొలి బాక్సర్ గా చరిత్ర సృష్టించాడు.

మనీశ్ కౌషిక్ కు కాంస్యం..

పురుషుల 63 కిలోల విభాగంలో పోటీకి దిగిన భారత మరో బాక్సర్ మనీష్ కౌషిక్…కాంస్యపతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
ప్రపంచ బాక్సింగ్ చరిత్రలో భారత బాక్సర్లు ఇప్పటి వరకూ కాంస్య పతకాలకు మాత్రమే పరిమితమవుతూ వచ్చారు. ఆ రికార్డును అమిత్ పంగాల్ రజత పతకంతో తిరగరాయగలిగాడు.

అమిత్ పంగల్ కు 14 లక్షల నజరానా

ప్రపంచ బాక్సింగ్ లో రజత, కాంస్య పతకాలు నెగ్గి స్వదేశానికి తిరిగి వచ్చిన భారత బాక్సింగ్ హీరోలు అమిత్ పంగల్, మనీశ్ కౌషిక్ లను కేంద్ర క్రీడామంత్రి కిరణ్ రిజ్జూ ఘనంగా సత్కరించి… భారీ నగదు పురస్కారాలను అందించారు.

న్యూఢిల్లీలో తమను కలసిన బాక్సర్ అమిత్ పంగల్ కు 14 లక్షల రూపాయలు, కాంస్య విజేత మనీష్ కౌషిక్ కు 8 లక్షల రూపాయలు చెక్ లను అందచేశారు.

ఇదే అత్యుత్తమ ప్రదర్శన…

ప్రపంచ బాక్సింగ్ చరిత్రలో ఇద్దరు భారత బాక్సర్లు పతకాలతో స్వదేశానికి తిరిగిరాడం ఇదే మొదటిసారి. అమిత్ పంగల్ 52 కిలోల విభాగంలో రజత, మనీష్ కౌషిక్ 63 కిలోల విభాగంలో కాంస్య పతకాలు సాధించి సరికొత్త రికార్డు నెలకొల్పారు.

గతంలో ప్రపంచ బాక్సింగ్ పతకాలు సాధించిన భారత బాక్సర్లలో విజేందర్ సింగ్ ( 2009 ), వికాస్ కిషన్ ( 2011 ), శివ థాపా ( 2015 ), గౌరవ్ బిదూరీ ( 2017 ) కాంస్యాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

ప్రస్తుత ప్రపంచ బాక్సింగ్ పోటీలలో మొత్తం78 దేశాలకు చెందిన బాక్సర్లు పోటీకి దిగగా… భారత్ తో సహా తొమ్మిది దేశాలకు చెందిన బాక్సర్లు మాత్రమే ఫైనల్స్ చేరగలిగారు.

ఉజ్బెకిస్థాన్ కు చెందిన నలుగురు బాక్సర్లు వివిధ విభాగాల ఫైనల్స్ చేరడం ద్వారా తమ సత్తా చాటుకొన్నారు.

First Published:  24 Sept 2019 5:54 AM IST
Next Story