Telugu Global
NEWS

షేన్ వార్న్ డ్రైవింగ్ పై ఏడాది నిషేధం

నిబంధనలు ఆరోసారి అతిక్రమించిన కంగారూ దిగ్గజం 3వేల డాలర్ల జరిమానా, 15 పెనాల్టీ పాయింట్లు, 12 నెలల నిషేధం ఆస్ట్ర్రేలియా క్రికెట్ దిగ్గజం, వివాదాస్పద ఆటగాడు షేన్ వార్న్ ఇంగ్లండ్ గడ్డపై 12 మాసాలపాటు డ్రైవింగ్ చేయకుండా లండన్ లోని జిల్లా డిప్యూటీ జడ్జి నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు 3వేల డాలర్ల జరిమానా సైతం విధించారు. లెగ్ స్పిన్ ఆల్ రౌండర్ గా వార్న్ ఎంత మొనగాడో…వివాహేతర సంబంధాలు, ఇతర వివాదాలతో అంతే ఘనుడుగా […]

షేన్ వార్న్ డ్రైవింగ్ పై ఏడాది నిషేధం
X
  • నిబంధనలు ఆరోసారి అతిక్రమించిన కంగారూ దిగ్గజం
  • 3వేల డాలర్ల జరిమానా, 15 పెనాల్టీ పాయింట్లు, 12 నెలల నిషేధం

ఆస్ట్ర్రేలియా క్రికెట్ దిగ్గజం, వివాదాస్పద ఆటగాడు షేన్ వార్న్ ఇంగ్లండ్ గడ్డపై 12 మాసాలపాటు డ్రైవింగ్ చేయకుండా లండన్ లోని జిల్లా డిప్యూటీ జడ్జి నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు 3వేల డాలర్ల జరిమానా సైతం విధించారు.

లెగ్ స్పిన్ ఆల్ రౌండర్ గా వార్న్ ఎంత మొనగాడో…వివాహేతర సంబంధాలు, ఇతర వివాదాలతో అంతే ఘనుడుగా పేరుపొందాడు. భార్యాపిల్లలతో కలసి ఇంగ్లండ్ లో నివాసముంటున్న వార్న్ కు ఖరీదైన కార్లలో విహరించడం అంటే ఎంతో మక్కువ.

గంటకు 300 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయే ఓ అద్దె జాగ్వార్ కారులో దూసుకుపోతూ…ట్రాఫిక్ నిబంధనలు ఆరోసారి అతిక్రమించడం ద్వారా వార్న్ గత ఏడాది ఆగస్టులో దొరికిపోయాడు.

50 సంవత్సరాల వార్న్ గంటకు 64 కిలోమీటర్ల వేగంతో కారు నడుపుతూ చిక్కాడు. వాస్తవానికి 20 కిలోమీటర్ల వేగంతో వెళ్లాల్సిన రూటులో వార్న్ 64 కిలో మీటర్ల వేగంతో దూసుకుపోడం నేరంగా మారింది.

పశ్చిమ లండన్ లో నివాసముంటున్న వార్న్ 1845 పౌండ్లు జరిమానాగా విధించాలని…12 నెలలపాటు డ్రైవింగ్ చేయకుండా నిషేధంలో ఉండాలంటూ తీర్పు చెప్పారు. అంతేకాదు…దురుసుగా కారు తోలడం ఇదే మొదటిసారి కాదని…15 పెనాల్టీ పాయింట్లు సైతం వార్న్ ఖాతాలో జమ చేసినట్లు న్యాయమూర్తి ప్రకటించారు.

ఐదు పదుల వయసులో కుర్రాడిలా కారుతోలుతూ లండన్ పౌరులను భయపెడుతున్న వార్న్ డ్రైవింగ్ పై ఏడాది నిషేధం సబబేనని నిపుణులు అంటున్నారు.

First Published:  24 Sept 2019 12:30 AM GMT
Next Story