Telugu Global
National

నడిరోడ్డు పై నేరస్తుల ఊరేగింపు

హర్యానా గ్యాంగ్ స్టర్ పాప్లా గుజ్రార్ ను…రాజస్తాన్ లోని బెహ్రోర్ పోలీస్ స్టేషన్ లాకప్ నుండి తప్పించడానికి దాడి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న 13 మందిని పోలీసులు ఆదివారం అల్వార్ నగర వీధుల్లో కిలోమీటరు దూరం అర్ద నగ్నం గా పెరేడ్ చేయించారు. హర్యానా గ్యాంగ్ స్టర్ విక్రమ్ అలియాస్ పాప్లా గుజ్రార్ ను తప్పించ డానికి.. సెప్టెంబర్ 6 న బెహ్రర్ పోలీస్ స్టేషన్ పై పెద్ద ఎత్తున కాల్పులు జరిగాయి. “సెప్టెంబర్ 6 న […]

నడిరోడ్డు పై నేరస్తుల ఊరేగింపు
X

హర్యానా గ్యాంగ్ స్టర్ పాప్లా గుజ్రార్ ను…రాజస్తాన్ లోని బెహ్రోర్ పోలీస్ స్టేషన్ లాకప్ నుండి తప్పించడానికి దాడి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న 13 మందిని పోలీసులు ఆదివారం అల్వార్ నగర వీధుల్లో కిలోమీటరు దూరం అర్ద నగ్నం గా పెరేడ్ చేయించారు.

హర్యానా గ్యాంగ్ స్టర్ విక్రమ్ అలియాస్ పాప్లా గుజ్రార్ ను తప్పించ డానికి.. సెప్టెంబర్ 6 న బెహ్రర్ పోలీస్ స్టేషన్ పై పెద్ద ఎత్తున కాల్పులు జరిగాయి.

“సెప్టెంబర్ 6 న జరిగిన ప్రతి సంఘటనను ధృవీకరించడానికి, పాప్లా గ్యాంగ్ స్టర్స్ అక్కడికి రావడానికి, పోవడానికి ఎంచుకున్న మార్గాలను తెలుసుకోవడానికి (సంఘటన రోజున) వాళ్లను పెరేడ్ చేయించామని” ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

నిందితులపై రూ.50 వేల రివార్డు ఉంది. పాప్లాను బెహ్రర్ స్టేషన్ లాకప్ నుండి విడిపించడంలో వీరంతా పాల్గొన్నారని పోలీసు అధికారి తెలిపారు.

లోదుస్తులతో మాత్రమే ఉన్న 13 మంది గ్యాంగ్ స్టర్ల చేతులకు బేడీలు వేసి రద్దీగా ఉన్న మార్కెట్ గుండా కిలోమీటరు దూరం నడిపించినట్లు ఓ వీడియో లో కనిపిస్తున్నది.

సెప్టెంబర్ 6 సంఘటన తర్వాత అల్వార్ పోలీసులు చాలా విమర్శలను ఎదుర్కొన్నారు. అయితే నేరస్థులలో భయాన్ని కలిగించడానికి, స్థానికులలో భద్రతా భావాన్ని పెంచడానికి పోలీసులు చేసిన ఈ ప్రయత్నం ఉపకరిస్తుందని పోలీసులు అంటున్నారు.

సినిమా సన్నివేశాన్ని ప్రతిబింబిస్తూ సెప్టెంబర్ 6 న మూడు వాహనాలు బెహ్రర్ పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చాయి. వాటి నుండి 15 నుండి 20 మంది కిందికి దూకి… పోలీస్ స్టేషన్ పై దాదాపు 40 రౌండ్లు కాల్పులు జరిపారు. పోలీసులు ఈ హటాత్పరిణామానికి భయపడి దాక్కున్న నేపథ్యం లో… దాడి చేసిన వారు స్టేషన్‌లోకి వెళ్లి పాప్లా గుర్జార్‌ను తప్పించి తీసుకుపోయారు.

First Published:  24 Sept 2019 12:20 AM GMT
Next Story