Telugu Global
National

చంద్రబాబు నెత్తిన వర్మ పిడుగు

చంద్రబాబుతో చెడుగుడు ఆడుకోవడం రామ్ గోపాల్ వర్మకు కొత్తేం కాదు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా మొత్తం బాబు చుట్టూనే తిరుగుతుంది. అచ్చం చంద్రబాబునే పోలిన నటుడ్ని తీసుకొచ్చి, అప్పట్లో వర్మ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఒక దశలో ఆ సినిమాను ఏపీలో రిలీజ్ కాకుండా బాబు అడ్డుకున్నాడు. ఇప్పుడు మరోసారి చంద్రబాబును టార్గెట్ చేశాడు వర్మ. ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ పేరిట వర్మ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు […]

చంద్రబాబు నెత్తిన వర్మ పిడుగు
X

చంద్రబాబుతో చెడుగుడు ఆడుకోవడం రామ్ గోపాల్ వర్మకు కొత్తేం కాదు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా మొత్తం బాబు చుట్టూనే తిరుగుతుంది. అచ్చం చంద్రబాబునే పోలిన నటుడ్ని తీసుకొచ్చి, అప్పట్లో వర్మ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఒక దశలో ఆ సినిమాను ఏపీలో రిలీజ్ కాకుండా బాబు అడ్డుకున్నాడు. ఇప్పుడు మరోసారి చంద్రబాబును టార్గెట్ చేశాడు వర్మ.

‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ పేరిట వర్మ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ఈరోజు ఓ సాంగ్ రిలీజ్ చేశాడు వర్మ.

”బాబు చంపేస్తాడు” అనే లిరిక్స్ తో సాగే ఈ పాటలో చంద్రబాబు నిజస్వరూపాన్ని మరోసారి బట్టబయలు చేశాడు ఆర్జీవీ. మరీ ముఖ్యంగా… “వెయిట్ చేస్తాడు.. స్కెచ్ గీస్తాడు.. వెన్నుపోటు టైమ్ కోసం వేచి ఉంటాడు. గొయ్యి తీసే రోజు కోసం పూజ చేస్తాడు.. చంపేస్తాడు.. బాబు చంపేస్తాడు..” అనే లిరిక్స్ తో నేరుగా బాబుపై సెటైర్లు వేశాడు వర్మ.

ఇక్కడితో ఆగితే అతడు వర్మ ఎందుకవుతాడు. ఏకంగా లిరికల్ వీడియోలో చంద్రబాబు ఫొటోలు వాడేశాడు. ఈసారి ఇంకాస్త మసాలా దట్టిస్తూ లోకేష్ ఫొటోలు కూడా వాడేశాడు. గతంలో ఇలా బాబు ఫొటోలు వాడినందుకే చాలా విమర్శలు ఎదుర్కొన్న వర్మ, ఈసారి మరింత ఘాటుగా పాటను రిలీజ్ చేశాడు. సిరాశ్రీ రాసిన ఈ పాటను స్వయంగా వర్మ ఆలపించడం విశేషం.

First Published:  24 Sept 2019 2:06 PM IST
Next Story