"ఈనాడు"ది అసత్య కథనం " ఏపీ సీఎంవో ప్రకటన
గతకొద్ది కాలంగా టీడీపీ అనుకూల పత్రికలు ఏపీ రాష్ట్ర్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య నిప్పు రాజేసేందుకు బాగా ప్రయత్నిస్తున్నాయి. ఇలా చేయడం ద్వారా రాష్ట్ర్ర , కేంద్ర సంబంధాలను దెబ్బతీయాలన్నది వీరి ఆలోచనగా కనిపిస్తోంది. ఇప్పటికే బీజేపీలోకి తన మనుషులను పంపించిన చంద్రబాబు… జగన్‌కు, బీజేపీకి మధ్య నిప్పు రాజేస్తే తమకు ఏపీలో పట్టుదొరుకుందని భావిస్తున్నారు. ఈ తరహా ప్రచారానికి ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీని కూడా టీడీపీ పత్రికలు వాడుతున్నాయి. కేసీఆర్, జగన్ కలిసి కేంద్రానికి వ్యతిరేకంగా […]
గతకొద్ది కాలంగా టీడీపీ అనుకూల పత్రికలు ఏపీ రాష్ట్ర్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య నిప్పు రాజేసేందుకు బాగా ప్రయత్నిస్తున్నాయి. ఇలా చేయడం ద్వారా రాష్ట్ర్ర , కేంద్ర సంబంధాలను దెబ్బతీయాలన్నది వీరి ఆలోచనగా కనిపిస్తోంది. ఇప్పటికే బీజేపీలోకి తన మనుషులను పంపించిన చంద్రబాబు… జగన్‌కు, బీజేపీకి మధ్య నిప్పు రాజేస్తే తమకు ఏపీలో పట్టుదొరుకుందని భావిస్తున్నారు.
ఈ తరహా ప్రచారానికి ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీని కూడా టీడీపీ పత్రికలు వాడుతున్నాయి. కేసీఆర్, జగన్ కలిసి కేంద్రానికి వ్యతిరేకంగా ఏకమవుతున్నారన్న భావన కలిగించేందుకు కొంతకాలంగా టీడీపీ అనుకూల మీడియా ప్రయత్నిస్తోంది.
సోమవారం జరిగిన ఇద్దరు సీఎంల సమావేశంపై ఈనాడు పత్రిక ఇదే తరహా కథనాన్ని రాసింది. సీఎంలు చర్చించిన నదుల అనుసంధానం, ఇతర అంశాలను పక్కన పెట్టి… కేంద్రంపై ఇద్దరు సీఎంలు అసంతృప్తి అంటూ… ఈనాడు పత్రిక కథనాన్ని రాసింది. కేంద్రం చిన్నచూపు చూస్తోందంటూ ఇద్దరు సీఎంలు ఉమ్మడిగా అభిప్రాయపడ్డారంటూ అదేదో అధికారికంగా ప్రకటించినట్టు బ్యాక్స్ కట్టి పత్రికలో కథనాన్ని రాసింది.
ఈ కథనంపై ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం తీవ్రంగా స్పందించింది. కేంద్రం పై ఇద్దరు సీఎంలు అసంతృప్తి అంటూ ఈనాడు పత్రిక కల్పిత కథనం రాసిందంటూ సీఎంవో మండిపడింది. ఈనాడు పత్రికలో వచ్చినట్టు రాసిన అంశాలపై సీఎంల సమావేశంలో చర్చే జరగలేదని వెల్లడించింది.
ఊహాజనిత అంశాలను రాసి ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని ఈనాడు పత్రికకు ఏపీ సీఎంవో హితవు పలికింది. తప్పుడు ఉద్దేశంతో రాసిన ఈనాడు పత్రిక కథనాన్ని ఖండిస్తున్నామని… ఏపీ సీఎంవో ఒక ప్రకటన విడుదల చేసింది. ఇరు రాష్ట్రాల అభివృద్ధి అంశాలపై సమావేశం జరగగా దానికి రాజకీయ అంశాలను జోడించడం సరికాదని సీఎంవో హితవు పలికింది.