Telugu Global
NEWS

గోదావరిని ముట్టని గ్రామస్తులు

తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరువద్ద జరిగిన బోటు ప్రమాదంలో ఇంకా 14 మృతదేహాలు లభ్యం కాలేదు. బోటు కూడా 250 అడుగుల లోతుగా బురదలో కూరుకుపోయింది. దాంతో బోటు ఇప్పుడు వెలికితీయడం సాధ్యం కాదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి కూడా ఇటీవల ప్రకటించారు. వరద తగ్గిన తర్వాత బోటును బయటకు తీస్తామని చెప్పారు. ఇలా బోటు ఇంకా నీటిలోనే ఉండడం, 14 శవాలు కనిపించకపోవడంతో కచ్చులూరు, ఆ చుట్టుపక్కల గ్రామస్తులు గోదావరి జలాలను వాడడం […]

గోదావరిని ముట్టని గ్రామస్తులు
X

తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరువద్ద జరిగిన బోటు ప్రమాదంలో ఇంకా 14 మృతదేహాలు లభ్యం కాలేదు. బోటు కూడా 250 అడుగుల లోతుగా బురదలో కూరుకుపోయింది. దాంతో బోటు ఇప్పుడు వెలికితీయడం సాధ్యం కాదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి కూడా ఇటీవల ప్రకటించారు. వరద తగ్గిన తర్వాత బోటును బయటకు తీస్తామని చెప్పారు.

ఇలా బోటు ఇంకా నీటిలోనే ఉండడం, 14 శవాలు కనిపించకపోవడంతో కచ్చులూరు, ఆ చుట్టుపక్కల గ్రామస్తులు గోదావరి జలాలను వాడడం మానేశారు. నది మైల పడిందని గ్రామస్తులు చెబుతున్నారు. ఆఖరి మృతదేహాన్ని కూడా తీసిన తర్వాతే తాము నదికి పూజలు చేసి, శుద్ధి కార్యక్రమం నిర్వహించి ఆ తర్వాతే నీటిని వాడుతామని చెబుతున్నారు. అప్పటి వరకు తాము గోదావరి జలాలను వినియోగించబోమంటున్నారు.

ఇంకా శవాలు నీటిలో ఉన్నందు వల్లే తాము ఆ నీటిని వాడడం లేదని మహిళలు చెబుతున్నారు. దాదాపు 18 గ్రామాల ప్రజలు ఇలా గోదావరిని ముట్టుకోవడం మానేశారు. చివరకు పశువులను కూడా అటువైపు వెళ్లనివ్వడం లేదు. పూర్తిగా బోరు నీటినే వాడుతున్నారు. సాధారణ అవసరాలకు కూడా గోదావరి జలాలను వినియోగించడం లేదు.

ఇప్పుడే కాదని…. గతంలో గోదావరి నదిలో ప్రమాదాలు జరిగినప్పుడు ఇదే తరహాలో తాము నీటిని వాడకుండా ఉండేవారిమని గ్రామస్తులు చెబుతున్నారు. ప్రమాదంలో చనిపోయిన వారి శవాలన్నింటిని వెలికితీసిన తర్వాతే తాము గోదావరి జలాలను వాడడం ఎప్పటి నుంచో అనవాయితీగా వస్తోందని గ్రామస్తులు చెబుతున్నారు. అప్పటి వరకు బోర్లలో వచ్చే నీటినే వాడుతామంటున్నారు.

First Published:  24 Sept 2019 11:32 AM IST
Next Story