Telugu Global
NEWS

పీపీఏల వ్యవహారంలో ప్రభుత్వానికి ఊరట

విద్యుత్ ఒప్పందాల పునర్‌ సమీక్ష వ్యవహారంలో విద్యుత్ కంపెనీలకు హైకోర్టులో ఊరట లభించలేదు. పీపీఏలను అసలు పునర్‌ సమీక్షించే అధికారమే ప్రభుత్వానికి లేదన్న వాదనల్ని హైకోర్టు తోసిపుచ్చింది. పీపీఏల సమీక్షపై ఏపీ ఈఆర్‌సీకి వెళ్లేందుకు ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను హైకోర్టు అంగీకరించింది. ఇకపై పీపీఏల పునర్‌ సమీక్షకు సంబంధించిన వాదనలు ఏమైనా ఉంటే ఏపీఈఆర్‌సీ ముందే వినిపించాలని హైకోర్టు ఆదేశించింది. ఆరు నెలల్లోగా ఈ వ్యవహారాన్ని తేల్చాల్సిందిగా ఏపీఈఆర్‌సీకి హైకోర్టు సూచించింది. అప్పటి వరకు విద్యుత్ సంస్థలకు […]

పీపీఏల వ్యవహారంలో ప్రభుత్వానికి ఊరట
X

విద్యుత్ ఒప్పందాల పునర్‌ సమీక్ష వ్యవహారంలో విద్యుత్ కంపెనీలకు హైకోర్టులో ఊరట లభించలేదు. పీపీఏలను అసలు పునర్‌ సమీక్షించే అధికారమే ప్రభుత్వానికి లేదన్న వాదనల్ని హైకోర్టు తోసిపుచ్చింది. పీపీఏల సమీక్షపై ఏపీ ఈఆర్‌సీకి వెళ్లేందుకు ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను హైకోర్టు అంగీకరించింది.

ఇకపై పీపీఏల పునర్‌ సమీక్షకు సంబంధించిన వాదనలు ఏమైనా ఉంటే ఏపీఈఆర్‌సీ ముందే వినిపించాలని హైకోర్టు ఆదేశించింది. ఆరు నెలల్లోగా ఈ వ్యవహారాన్ని తేల్చాల్సిందిగా ఏపీఈఆర్‌సీకి హైకోర్టు సూచించింది.

అప్పటి వరకు విద్యుత్ సంస్థలకు మధ్యంతర చెల్లింపులను కుదించిన టారీఫ్‌ ప్రకారం యూనిట్‌కు రూ. 2.43పైసలు చెల్లిస్తామన్న ప్రభుత్వ ప్రతిపాదనకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ప్రభుత్వం నోటీసులు ఇచ్చి, చట్టప్రకారం విద్యుత్‌ ఉత్పత్తిని నిలిపివేయవచ్చని హైకోర్టు వెల్లడించింది. ప్రస్తుతానికి విద్యుత్ కంపెనీల నుంచి విద్యుత్‌ను తిరిగి తీసుకోవాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

First Published:  24 Sept 2019 10:29 AM IST
Next Story