సై రా లో 3800 వీఎఫ్ఎక్స్ షాట్స్
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా పై అంచనాలు రోజురోజుకు పెరుగుతూనే వస్తున్నాయి. బ్రిటీష్ వారి గుండెల్లో రైళ్ళు పరిగెత్తించిన తెలుగు వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కనున్న ఈ సినిమాకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్ చరణ్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ వైభవంగా జరిగింది. ఈ ఈవెంట్ కి […]
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా పై అంచనాలు రోజురోజుకు పెరుగుతూనే వస్తున్నాయి. బ్రిటీష్ వారి గుండెల్లో రైళ్ళు పరిగెత్తించిన తెలుగు వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కనున్న ఈ సినిమాకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు.
కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్ చరణ్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ వైభవంగా జరిగింది. ఈ ఈవెంట్ కి ప్రముఖ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ముఖ్య అతిథిగా వచ్చాడు. ఈ వేడుకలో మాట్లాడుతూ… రాజమౌళి ఈ సినిమాకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు.
రామ్ చరణ్…. కేవలం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథని 20 ఏళ్లుగా గుండెల్లో మోస్తున్న పరుచూరి బ్రదర్స్ కి ఇచ్చిన బహుమతి మాత్రమే కాదని….. తెలుగు ప్రజలందరికీ ఇచ్చే కానుక అని ఆయన అన్నారు.
అంతే కాకుండా ‘బాహుబలి’ సినిమాలో 2300 విఎఫ్ఎక్స్ షాట్స్ ఉన్నాయని… కానీ ‘సైరా’ సినిమాలో 3800 వీఎఫ్ ఎక్స్ షాట్స్ ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. వీఎఫ్ ఎక్స్ షాట్స్ తీయడం కష్టం కాదని… వందల, వేల షాట్ల మధ్యలో ఎమోషన్లని మర్చిపోకుండా వాటిని ప్రెజెంట్ చేయడం చాలా కష్టమైన పని అని ఆయన అన్నారు. భారీ అంచనాల మధ్య ‘సైరా’ సినిమా అక్టోబర్ 2న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే.