టీ-20ల్లో ధోనీ సరసన రోహిత్ శర్మ
98 టీ-20లతో ధోనీ రికార్డు సమం ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్లో అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడిన మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రికార్డును…డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ సమం చేశాడు. సౌతాఫ్రికాతో ముగిసిన తీన్మార్ సిరీస్ లో భాగంగా…బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా ముగిసిన మూడో టీ-20 మ్యాచ్ బరిలోకి దిగడం ద్వారా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ తన కెరియర్ లో 98 మ్యాచ్ ల మైలురాయిని చేరాడు. మాజీ కె్ప్టెన్ మహేంద్ర […]
- 98 టీ-20లతో ధోనీ రికార్డు సమం
ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్లో అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడిన మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రికార్డును…డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ సమం చేశాడు.
సౌతాఫ్రికాతో ముగిసిన తీన్మార్ సిరీస్ లో భాగంగా…బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా ముగిసిన మూడో టీ-20 మ్యాచ్ బరిలోకి దిగడం ద్వారా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ తన కెరియర్ లో 98 మ్యాచ్ ల మైలురాయిని చేరాడు.
మాజీ కె్ప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మొత్తం 98 మ్యాచ్ లతో అత్యధిక టీ-20 మ్యాచ్ లు ఆడిన భారత క్రికెటర్ గా నిలిచాడు. ఇప్పుడు ఆ రికార్డును రోహిత్ సమం చేయగలిగాడు.
2007 టు 2019
2007లో డర్బన్ వేదికగా ఇంగ్లండ్ తో జరిగిన ప్రపంచకప్ మ్యాచ్ ద్వారా టీ-20 అరంగేట్రం చేసిన రోహిత్ శర్మ గత 12 సంవత్సరాల కాలంలో 98 మ్యాచ్ లు ఆడి నాలుగు సెంచరీలు, 17 హాఫ్ సెంచరీలతో సహా 2వేల 443 పరుగులు సాధించాడు. 32.14 సగటు నమోదు చేశాడు.
రోహిత్, ధోనీల తర్వాత అత్యధిక టీ-20 మ్యాచ్ లు ఆడిన భారత క్రికెటర్ల వరుసలో సురేశ్ రైనా (78), విరాట్ కొహ్లీ ( 72), యువరాజ్ సింగ్ ( 58 ), శిఖర్ ధావన్ ( 55 ) ఉన్నారు.
సౌతాఫ్రికాతో ముగిసిన తీన్మార్ టీ-20 సిరీస్ లోని రెండుమ్యాచ్ ల్లో రోహిత్ స్థాయికి తగ్గట్టుగా రాణించలేకపోయాడు. మొహాలీ టీ-20లో 12 పరుగులు, బెంగళూరు మ్యాచ్ లో 9 పరుగుల స్కోర్లు మాత్రమే సాధించాడు.