Telugu Global
NEWS

అవసరమైతే వీఆర్‌ఓ వ్యవస్థనే ఎత్తేస్తాం... ఉద్యోగులకు కేసీఆర్‌ క్లాస్‌

తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఉద్యోగులకు పరోక్షంగా వారి హద్దులను గుర్తు చేశారు. ఉద్యోగులు ప్రభుత్వాన్ని శాసించే పరిస్థితి ఉండకూదని స్పష్టం చేశారు. ప్రభుత్వం చెప్పింది ఉద్యోగులు చేయాలి అంతే అంటూ వ్యాఖ్యానించారు. కుక్క… తోకను ఊపుతుందా!. లేక తోకే కుక్కను ఊపుతుందా! అని ప్రశ్నించారు. చట్టాలు మార్చి కొత్త చట్టాలు తీసుకురావొద్దు అంటే పాలన ఎలా నడుస్తుంది అని ప్రశ్నించారు. అవసరం ఉన్నప్పుడు కొత్త చట్టాలు తేవాల్సిందేనన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనే ఎవరికీ భయపడలేదని ఇప్పుడు కూడా అదే […]

అవసరమైతే వీఆర్‌ఓ వ్యవస్థనే ఎత్తేస్తాం... ఉద్యోగులకు కేసీఆర్‌ క్లాస్‌
X

తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఉద్యోగులకు పరోక్షంగా వారి హద్దులను గుర్తు చేశారు. ఉద్యోగులు ప్రభుత్వాన్ని శాసించే పరిస్థితి ఉండకూదని స్పష్టం చేశారు. ప్రభుత్వం చెప్పింది ఉద్యోగులు చేయాలి అంతే అంటూ వ్యాఖ్యానించారు. కుక్క… తోకను ఊపుతుందా!. లేక తోకే కుక్కను ఊపుతుందా! అని ప్రశ్నించారు.

చట్టాలు మార్చి కొత్త చట్టాలు తీసుకురావొద్దు అంటే పాలన ఎలా నడుస్తుంది అని ప్రశ్నించారు. అవసరం ఉన్నప్పుడు కొత్త చట్టాలు తేవాల్సిందేనన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనే ఎవరికీ భయపడలేదని ఇప్పుడు కూడా అదే తరహాలో రాష్ట్రం కోసం నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు.

రాష్ట్రంలో లంచాలు లేని వ్యవస్థను తయారు చేస్తామని… ఇందుకు అద్భుతమైన రెవెన్యూ చట్టం తెస్తామన్నారు. నలుగురు ఉద్యోగులకు అది నచ్చలేదంటే భయపడి వెనక్కు తగ్గేది లేదన్నారు. ప్రభుత్వం చెప్పిన పని మాత్రమే ఉద్యోగులు చేయాల్సి ఉంటుందని… ఉద్యోగులే ప్రభుత్వాన్ని నిర్దేశించే పరిస్థితి ఉండకూదన్నారు.

వీఆర్‌వో వ్యవస్థను రద్దు చేస్తామని తాము ఎక్కడైనా చెప్పామా అని కేసీఆర్‌ ప్రశ్నించారు. ఒకవేళ వీఆర్‌వో వ్యవస్థను తీసేయాల్సి వస్తే చేసి తీరుతామన్నారు. వీఆర్‌వోలు ఏమైనా ఆకాశం నుంచి ఊడిపడ్డారా…. ఒకప్పుడు పటేల్, పట్వారీ వ్యవస్థను రద్దు చేయలేదా అని ప్రశ్నించారు.

అప్పట్లో వారి అరాచకాలు ఎక్కువయ్యాయి కాబట్టే పటేల్, పట్వారీ వ్యవస్థను తొలగించారన్నారు. ఇప్పుడు వీఆర్‌వోలు అలాగే ఉంటే తీసేయక తప్పదు అని కేసీఆర్‌ హెచ్చరించారు.

రాష్ట్రంలో అభివృద్ధి కోసం మరిన్ని అప్పులు తెచ్చేందుకు ఏమాత్రం వెనుకాడేది లేదని కేసీఆర్‌ స్పష్టం చేశారు. తమ వద్ద మరో మూడు కొత్త పథకాలకు సంబంధించిన ఆలోచనలు ఉన్నాయని… వాటిని అమలు చేస్తే ఇక తెలంగాణలో కాంగ్రెస్ ఖతమైతది అని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు.

First Published:  23 Sept 2019 4:25 AM IST
Next Story